OG Firestorm: ఓజీ ఫైర్ స్ట్రామ్ గంభీర.. లిరికల్ వీడియో వచ్చేసింది
ABN, Publish Date - Aug 02 , 2025 | 02:55 PM
నాలుగు రోజులుగా ఓజీ ఫైర్ స్ట్రామ్ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ గురించి తెలిసిందే. సినిమా టీమ్‌తోపాటు అభిమానులు ఓ రేంజ్‌లో హడావిడి చేయడంతో సోషల్ మీడియాలో ఓజీ సినిమా రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇప్పుడీ పాటను సోషల్ మీడియాలో విడుదల చేశారు. పవన్ కల్యాణ్ హీరోగా డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న చిత్రమిది. సుజీత్ దర్శకుడు. తమన్ స్వరాలందించిన ఫైర్ స్ట్రామ్ పాటను శనివారం విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
Updated at - Aug 02 , 2025 | 02:57 PM