సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

HBD Pawan Kalyan: అభిమానుల దాహం తీర్చుతున్న ఓజీ

ABN, Publish Date - Sep 02 , 2025 | 10:01 AM

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ఓజీ. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇప్పటికే వచ్చేసింది. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ డేట్ ను కన్ ఫర్మ్ చేస్తూ మరో పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

OG movie New poster

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దాహార్తిని తీర్చుతోంది ఇప్పుడు 'ఓజీ' (OG) సినిమానే. ఆ సినిమా నుండి వస్తున్న ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ను అభిమానులు ఎంతో ఇష్టపడుతున్నారు. ఫ్యాన్స్ మనసెరిగి దర్శకుడు సుజీత్ (Sujeeth), నిర్మాత డీవీవీ దానయ్య (DVV Danayya) వీటిని విడుదల చేస్తున్నారనిపిస్తోంది. నిజానికి 'హరిహర వీరమల్లు' విడుదలకు ముందు కూడా అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూసింది పవన్ కళ్యాణ్ 'ఓజీ' మూవీ గురించే. ఇందులో మునుపటి పవన్ కళ్యాణ్ ను తాము చూడొచ్చని, ఆయనలోని ఆ గ్రేస్ ను సిల్వర్ స్క్రీన్ పై ఎంజాయ్ చేయొచ్చని వాళ్ళు అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించేట్టుగానే వస్తూ ఉంది.


ఇవాళ పవన్ కళ్యాణ్‌ బర్త్ డే సందర్భంగానూ తాజాగా విషెస్ తెలియచేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ కూ మంచి స్పందన లభిస్తోంది. విశేషం ఏమంటే ఈ రోజు సాయంత్రం 'ఓజీ' టీమ్ పవన్ ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. అది ఏమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంచారు.

ఇదే సమయంలో పవన్ కళ్యాణ్‌ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీకి సంబంధించిన బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో విశేషంగా చక్కర్లు కొడుతోంది. దీనిని మించి ఈ సినిమా నుండి ఇంకేమైనా అప్ డేట్స్ వస్తాయేమో చూడాలి.

Also Read: HBD Powerstar Pawan Kalyan: సెప్టెంబర్ సెంటిమెంట్...

Also Read: Power Star: తమ్ముడు పవన్ కు చిరు శుభాకాంక్షలు...

Updated Date - Sep 02 , 2025 | 10:49 AM