HBD Powerstar Pawan Kalyan: సెప్టెంబర్ సెంటిమెంట్...
ABN , Publish Date - Sep 02 , 2025 | 09:36 AM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సెప్టెంబర్ 2 అంటే ఆయన ఫ్యాన్స్ కు పండగ లాంటిది. ఇంతకు ముందు కన్నా ఈ సారి బర్త్ డేకు పవన్ ఫ్యాన్స్ లో జోష్ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఆ ముచ్చటేంటో చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జరుపుకుంటున్న రెండవ బర్త్ డే ఇది. కాబట్టి అందులో స్పెషల్ ఏమీలేదు. పోనీ పవన్ నటించిన సినిమాలు వస్తున్నాయా అంటే సెప్టెంబర్ 25న 'ఓజీ' (OG) రిలీజ్ కానుంది. జూలైలోనే పవన్ నటించిన 'హరిహర వీరమల్లు' వచ్చి ఫ్యాన్స్ కు నిరాశ కలిగించింది. అయినా సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ బర్త్ డేను ఫ్యాన్స్ మరింత ఉత్సాహంగా జరుపుకోవడానికి కారణం ఇటీవల వైజాగ్ లో జరిగిన 'జనసేన' (Janasena) సభ విజయవంత మయింది. ఆ రోజున కేవలం తెలుగునేలపైని పవన్ ఫ్యాన్స్ కాకుండా ఇతర రాష్ట్రాల్లోని అభిమానులు సైతం 'జనసేన'కు జై కొడుతూ వచ్చారు. దాంతో పవన్ తో పాటు, ఆయన ఫ్యాన్స్ లోనూ వైజాగ్ మీటింగ్ ఉత్సాహం నింపింది. ఈ నేపథ్యంలో ఇవాళ జరుగుతున్న పవన్ కళ్యాణ్ బర్త్ డేకు మునుపటి కంటే మిన్నగా ప్రత్యేకత సంతరించుకుంది.
పవన్ కళ్యాణ్ కు చివరి బిగ్ హిట్ ఏదంటే 2013లో వచ్చిన 'అత్తారింటికి దారేది' (Attarintiki daaredi) అనే చెప్పాలి. ఆ తరువాత జనం ముందు నిలచిన పవన్ కళ్యాణ్ సినిమాలేవీ ఆ స్థాయిలో అలరించలేకపోయాయి. పైగా ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల కూడా తక్కువ సినిమాల్లోనే నటించారు. అవేవీ అంతగా మురిపించలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఈ యేడాది 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) తరువాత సెప్టెంబర్ 25న 'ఓజీ' సినిమా వస్తోంది. 'హరిహర వీరమల్లు' అలరించలేకపోయినా, 'ఓజీ' తప్పకుండా తమను మెప్పిస్తుందని ఫ్యాన్స్ అమితాసక్తితో ఉన్నారు. పైగా పవన్ కళ్యాణ్ నటించిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ 'ఓజీ' కావడం విశేషం! అందువల్ల కూడా సెప్టెంబర్ 2న మరింత జోష్ గా పవన్ బర్త్ డేను అభిమానులు జరుపుకుంటున్నారు.
దాదాపు పుష్కరకాలం క్రితం ఫ్యాన్స్ ను విశేషంగా అలరించిన 'అత్తారింటికి దారేది' సినిమా కూడా సెప్టెంబర్ లోనే రిలీజయింది. అదే తీరున ఇప్పుడు రాబోయే 'ఓజీ' కూడా మురిపిస్తుందని అభిమానుల నమ్మకం. 2013 సెప్టెంబర్ 27న 'అత్తారింటికి దారేది' రిలీజయింది. మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ 25న 'ఓజీ' వస్తోంది. కాబట్టి సెప్టెంబర్ సెంటిమెంట్ కారణంగా పవన్ కు ఈ సారి బంపర్ హిట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇలా పలు లెక్కల కారణంగా సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ 55వ పుట్టినరోజును ఫ్యాన్స్ విశేషంగా జరుపుకోనున్నారు. ఏపీ డిప్యూటీ సీయమ్ గా, అభిమానుల మదిలో పవర్ స్టార్ గా నిలచిన పవన్ కళ్యాణ్ ఈ బర్త్ డే తరువాత ఇంకా ఏ తీరున సాగుతారో చూడాలి.
Also Read: Power Star: తమ్ముడు పవన్ కు చిరు శుభాకాంక్షలు...
Also Read: Tuesday Tv Movies: మంగళవారం, సెప్టెంబర్ 02.. తెలుగు టీవీ మాధ్యమాల్లో ప్రసారమయ్యే సినిమాలివే