OG Movie: 'ఓజీ'.. ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది
ABN , Publish Date - Aug 16 , 2025 | 03:25 PM
పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరగా గ్యాంగ్‌స్టర్ అవతార్‌లో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'ఓజీ' (Og Movie). డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా ఇది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరగా గ్యాంగ్‌స్టర్ అవతార్‌లో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో ఆమె కన్మణి పాత్రలో కనిపించనున్నారు.ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలు పెంచింది. తాజాగా విడుదల చేసిన ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul mohan) లుక్ కూల్ గా ఆకట్టుకునేలా ఉంది. తుఫానుకు అవసరమైన ప్రశాంతత ప్రియాంక మోహన్ పాత్ర అని నిర్మాణ సంస్థ ఎక్స్ లో పేర్కొంది.
ఇటీవల విడుదలైన 'ఓజీ' మొదటి గీతం 'ఫైర్ స్టార్మ్'కు విశేష స్పందన లభించింది. ఇప్పుడు రెండవ గీతాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో ప్రోమో విడుదల కానుంది. ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రాహకులుగా రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.సెప్టెంబర్ 25, ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.
ALSO READ: Aamir Khan: రజనీతో స్క్రీన్ షేర్ చేసుకోవడమే కోట్లతో సమానం..
Hearty Singh: ఈ పిల్లాడు ఎవరో గుర్తు పట్టారా... వార్ 2లో ఆ పాత్ర ...