OG Movie: టైమ్ లేదు గంభీర.. ప్రమోషన్స్ మొదలెట్టు

ABN , Publish Date - Aug 25 , 2025 | 05:13 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎక్కడ కనిపించినా అభిమానుల నుంచి వచ్చే ఒకే ఒక్క మాట ఓజీ (OG). కుర్ర డైరెక్టర్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

OG Movie

OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎక్కడ కనిపించినా అభిమానుల నుంచి వచ్చే ఒకే ఒక్క మాట ఓజీ (OG). కుర్ర డైరెక్టర్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. పవన్ ఏ ఈవెంట్ కు వెళ్ళినా ఓజీ నామస్మరణమే. ఇక ఎట్టకేలకు సెప్టెంబర్ 25 న ఓజీ ప్రేక్షకుల ముందకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ కు ఇంకా పట్టుమని నెలరోజులు కూడా సమయం లేదు. కానీ, మేకర్స్ మాత్రం ప్రమోషన్స్ మొదలుపెట్టలేదు. దీంతో ఫ్యాన్స్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.


మళ్లీ ఏదైనా జరిగి ఎక్కడ ఈసారి కూడా ఓజీ వాయిదా పడుతుందేమో అని భయపడుతున్నారు. అలా జరగడానికి అస్సలు అవకాశం లేదని ఇండస్ట్రీ వర్గాల మాట. మరి ఎందుకింత ఆలస్యం అంటే.. అందుతున్న సమాచారం ప్రకారం ఓజీ ఘాట్ ఇంకా బాలెన్స్ ఉందని అంటున్నారు. అదేంటీ ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ ఫినిష్ అయ్యిందని చెప్పారు కదా.. మళ్లీ ఘాట్ ఏంటి అంటే.. పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఇంకో 6 రోజులు ఘాట్ ఉందని,ఈ మధ్యనే పవన్ ఆ ఘాట్ ను ఫినిష్ చేసే పనిలో పడ్డాడని టాక్ నడుస్తోంది. ప్రమోషన్స్ సినిమాకు ఎంత ముఖ్యమో అందరికీ తెల్సిందే.


ఎన్నికోట్లు ఖర్చుపెట్టి సినిమా తీసినా ప్రేక్షకుల్లోకి ఆ సినిమాను తీసుకెళ్లకపోతే అది సక్సెస్ అవ్వదు. అది గమనించే పవన్.. హరిహర వీరమల్లుకు ఆ రేంజ్ లో ప్రమోషన్స్ చేశాడు. ఇక ఇప్పుడు ఓజీకి కూడా పవన్ ప్రమోషన్స్ కు వస్తాడని అంటున్నారు. ప్రస్తుతం సుజీత్ ఒకపక్క షూటింగ్.. ఇంకోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు.ఇప్పుడప్పుడే ఈ ప్రమోషన్స్ మొదలు అయ్యేలా కనిపించడం లేదు. ఎలాగోలా నెమ్మదిగా పోస్టర్స్, లిరికల్ వీడియోస్ తో మేకర్స్ హైప్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే బయ్యర్లు.. దానయ్యను తొందర పెడుతుండడం మరో ఎత్తు. సినిమా మొత్తం ఫినిష్ అయ్యి చేతికి వస్తే బయ్యర్లతో డీల్ మాట్లాడే పని మొదలెడదామని దానయ్య వెయిటింగ్. ఇలా ఓజీ సినిమా మొత్తం గజిబిజిగా మారింది. ఇప్పటి నుంచి అయినా ప్రమోషన్స్ మొదలుపెడితేనే అప్పటికి రీచ్ వస్తుంది. మరి సుజీత్ ఏమ చేస్తాడో చూడాలి.

Divya Khosla: తెలుగు చిత్రసీమలోనే...

Nitya Ram: కూలీ కళ్యాణి అక్క కూడా హీరోయినే.. ఎవరో తెలుసా

Updated Date - Aug 25 , 2025 | 05:13 PM