Mass Jathara: మాస్ మహారాజా మైల్‌స్టోన్ అప్‌డేట్ వచ్చేసింది
ABN , Publish Date - Aug 03 , 2025 | 03:34 PM
మాస్‌మహారాజా రవితేజ (Ravi teja) తాజాగా నటిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’ (Mass Jathara) . ఆయన కెరీర్‌లో ఇది మైల్‌స్టోన్ సినిమా.
మాస్‌మహారాజా రవితేజ (Ravi teja) తాజాగా నటిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’ (Mass Jathara) . ఆయన కెరీర్‌లో ఇది మైల్‌స్టోన్ సినిమా. ఆయన నటిస్తున్న 75వ చిత్రమిది. భాను భోగవరపు (Bhanu bhogavarapu) దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ దాదాపు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరో పక్క నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి ‘ఓలే ఓలే’ అంటూ సాగే పాట ప్రోమోను విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ALSO READ: Coolie Movie: కూలీపై కాపీ మరక.. ఒకటి కాదు రెండు సినిమాలు
ఈ విజయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు. సోమవారం ఉదయం 11.08 గంటలకు ఈ ప్రొమోను విడుదల చేయనున్నారు. సినిమా విడుదలపైనా క్లారిటీ ఇచ్చారు. ఆ పోస్టర్‌లో ‘ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 27న విడుదల’ అని తెలిపారు. దీనిని బట్టి ఈ చిత్రం వినాయక చవితికి పక్కాగా రానుందని క్లియర్‌గా చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ముమ్మరం చేశారు. రవితేజ స్టైల్ మాస్ మసాలా చిత్రమిది.
ALSO READ: Krishna Master: రేప్ కేసు.. ఢీ, బీబీ జోడి డాన్స్ మాస్టర్ కృష్ణ అరెస్ట్
Allu Aravind: పవన్ కల్యాణ్.. మహావతార్ నరసింహా చూడాలి
Ojas Gambheera: నాలుగు నిమిషాల పాట.. ఫ్యాన్ బోయ్ చాలానే చెప్పాడు..
Rajinikanth: రెండు రూపాయలు ఇచ్చి.. బాధ కలిగించేలా మాట్లాడాడు..