War 2 Twitter X Review: హృతిక్ రోషన్, జూ.ఎన్టీఆర్.. వార్ 2 ఎలా ఉందంటే! ట్విట్టర్ X రివ్యూ
ABN, Publish Date - Aug 14 , 2025 | 06:49 AM
భారీ అంచనాల మధ్య హృతిక్ రోషన్, జూ.ఎన్టీఆర్.. వార్ 2 చిత్రం ప్రేక్షకుల ఎదుటకు వచ్చేసింది.
హృతిక్ రోషన్ (Hrithik Roshan), జూ.ఎన్టీఆర్ (Jr NTR) కాంబినేషన్‌లో ఐదేండ్ల క్రితం వచ్చిన బ్లాక్‌బస్టర్ వార్ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందించిన చిత్రం వార్2 (War 2). ఎన్టీఆర్ ఈ చిత్రంతో డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండడం ప్రత్యేకతను సంతరించుకోగా బ్రహ్మాస్త్ర వంటి క్లాసికి హిట్ తర్వాత అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కియారా అద్వానీ కథానాయుకగా నటించింది. రజనీ కూలీ చిత్రం కూడా ఈ సినిమాకు పోటీగా బరిలోకి దిగడంతో సర్వత్రా ఇప్పుడు అందరి చూపు ఈ రెండు సినిమాలపైన మాత్రమే ఉన్నాయి. రెండు వారాల ముందు నుంచే కూలీ ప్రచార కార్యకమాలు జరుపుకోని రికార్డ్ స్థాయిలో అడ్వాన్స్ కలెక్షన్లు సంపాదించుకోడా ఆలస్యంగా మేల్కొన్న వార్2 బృందం ఫ్రీ టికెట్ సేల్స్ మాత్రం వెనకబడింది. ఇప్పటికే మన దేశంలో వార్2 చిత్రం తెల్లవారుజాము షోలు పడగా ఇతర దేశాల్లోనూ ఫస్ట్ షోలు పడ్డాయి. మూవీ చూసిన వారు తమదైన శైలిలో రియాక్ట్ అవుతూ సామాజిక మాద్యమాల్లో తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.
ఇక సినిమా విషయానికి వస్తే.. వార్ 2 సినిమా ఔట్ అండ్ ఔట్ స్టైలిష్, మీడియోకర్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారని, గత స్పై యూనివర్స్ చిత్రాలకు భిన్నంగా ఈ సారి కథ ఉందని అంటున్నారు. సినిమా స్టార్టింగ్ సెటప్ బాగా ఉండడమే గాక, హీరోల ఇంట్రడక్షన్ సీన్స్, డ్యాన్స్ నంబర్, కొన్ని ట్విస్ట్‌లు బాగా వర్కౌట్ అయ్యాయని పేర్కొంటున్నారు. ఎన్టీఆర్ షార్ట్‌లెస్ ఈ సినిమా మొత్తానికే హైలెట్ అని అంటున్నారు. ఇంటర్వెల్, ఫ్రీ క్లైమాక్స్ ట్విస్టులు అదిరి పోయాయని, ఓ ఇద్దరు ముగ్గురు బాలీవుడ్ స్టార్స్ సైతం క్యామియోలు ఎంట్రీ ఇచ్చారని, త్వరలో రానున్న ఓ సినిమా క్యారెక్టర్ సైతం కాసేపు కనిపించి అలరిచిందని చెబుతున్నారు. కియారా గ్లామర్, ఊపిరి ఊయల పాట విజువల్‌గా వండర్‌గా ఉన్నాయని పోస్టులు పెడుతున్నారు.
ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హృతిక్, ఎన్టీఆర్‌ల గురించేనని పాటలు, యాక్షన్ సీన్లలో ఒకరిని మించి మరొకరు పోటీ పడి ఇరగదీశారని, వాటిని హాలీవుడ్‌లో తెరకెక్కించారని, ఇద్దరికి స్క్రీన్ స్పేస్ విషయంలో ఇబ్బందులు లేకుండా బాగా చూశారని అంటున్నారు. అయితే ప్రొడక్షన్ వాల్యూస్ మంచి స్థాయిలో ఉన్నప్పటికీ బోట్ ఫైట్ సీక్వెన్ లో యానిమేషన్‌లు తేలిపోయాయని, వరస్ట్‌గా ఉన్నట్లు రాసుకొస్తున్నారు. కథ ఢిఫరెంట్‌గా ఉన్నప్పటికీ ఎప్పటిలానే తీసే ప్రయత్నం చేశారని, కథకు తగ్గట్లు తీయలేదనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. కోర్ స్టోరీలో ఉండాల్సిన ఎమోషన్ మరియు హై పాయింట్‌లను సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేదని అంటున్నారు. మొత్తానికైతే ఇద్దరు లీడ్ యాక్టర్స్ తమ పాత్రలకు తగ్గట్టు నటించారని, క్లైమాక్స్‌లో వారి పెర్ఫార్మెన్స్ ఓ రేంజ్‌లో ఉందని ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు వారు ఓ సారి చూడవచ్చని పోస్టులు పెడుతన్నారు.