Coolie: ‘కూలీ’.. రజినీకాంత్ స్టాండలోన్ చిత్రం! లోకేశ్ ఎమోషనల్ పోస్ట్
ABN , Publish Date - Aug 13 , 2025 | 10:49 PM
‘కూలీ’ మరి కొద్ది గంటల్లో విడుదల కానుండగా లోకేష్ కనగరాజ్ తన మనసులోని భావాలను పంచుకుంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన లేఖ వైరల్ గా మారింది.
సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటించిన భారీ చిత్రం ‘కూలీ’ (Coolie) మరి కొద్ది గంటల్లో విడుదల కానుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా టికెట్లు ఫ్రీ బుకింగ్ సేల్స్ ఓ రేంజ్‌లో ఉండి సంచనలమే సృష్టిస్తోంది. అయితే సినిమా రికలీజ్‌కు గంటల సమయం మాత్రమే మిగిలి ఉండగా, ఈ చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh kanakaraj) తన మనసులోని భావాలను పంచుకుంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన లేఖ వైరల్ గా మారింది. రజనీకాంత్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.
"నా తలైవర్ రజినీకాంత్ గారికి మనసారా కృతజ్ఞతలు. ఆయన వల్లే నా ఎన్నో ఏండ్ల కలలలో నుంచి ఈ కథని రూపొందించాను. అందుకు నాకు పూర్తి క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చి, నా విజన్‌ని పెద్ద తెరపైకి తీసుకురావడానికి ప్రోత్సహించారని లోకేష్ రాసుకొచ్చాడు. అలాగే నా ఈ ప్రయాణాన్ని మరపురానిదిగా కూలీలో నటించిన ప్రధాన అద్భుత నటీనటుల చేశారు. కింగ్ నాగార్జున, రియల్ స్టార్ ఉపేంద్ర, సౌబిన్, సత్యరాజ్, శ్రుతి హాసన్, అలాగే ఆమీర్ ఖాన్ వంటి స్టార్‌లతో కలిసి పని చేయడం మరింత ప్రత్యేకమైందని అన్నారు.
అంతేగాక తన క్రూ కష్టాన్ని గుర్తు చేసుకుంటూ.. దాదాపు రెండు సంవత్సరాలుగా అహర్నిశలు కష్టపడి ఈ విజన్‌కి రూపం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటానని పేర్కొన్నారు. నన్ను నమ్మి సన్ పిక్చర్స్ కలానిధి మారన్ గారు ఈ ప్రాజెక్ట్‌ను అప్పగించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తన బృందం The Route, జగదీష్, ఐశ్వర్య, రాధేయన్ అందించిన సహకారం గురించి కూడా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు.
చివరగా ప్రేక్షకులను ఉద్దేశించి.. "మీరు చూపిన ప్రేమ, మద్దతు అద్భుతం. ‘కూలీ’ ఇంకో కొన్ని గంటల్లో మీ ముందుకు రాబోతోంది. థియేటర్‌లో సినిమాను ఎంజాయ్ చేయండి, కానీ స్పాయిలర్స్ మాత్రం పంచకండి అని విజ్ఞప్తి చేశారు. ఇదిలాఉంటే.. తలైవర్ సూపర్‌స్టార్ రజినీకాంత్ కోసం, అతనిపై నా కృతజ్ఞత కోసం ఈ ‘కూలీ’ని ఒక స్టాండ్అలోన్ చిత్రంగా రూపొందించినట్లు స్పష్టం చేశాడు.