Gamblers OTT: ఆ ఓటీటీకి వచ్చేసిన.. మ్యాడ్ హీరో లేటెస్ట్ మిస్టరీ థ్రిల్లర్
ABN , Publish Date - Aug 14 , 2025 | 07:47 AM
సంగీత్ శోభన్ కథానాయకుడిగా రూపొందిన కామెడీ, మిస్టరీ చిత్రం ‘గ్యాంబ్లర్స్’ .
మ్యాడ్ ఫేం సంగీత్ శోభన్ (Sangeeth Shobhan) కథానాయకుడిగా రూపొందిన కామెడీ, మిస్టరీ చిత్రం ‘గ్యాంబ్లర్స్’ (Gamblers). ప్రశాంతి చారులింగా (Prashanthi Charulinga) కథానాయిక. గతంలో ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో ‘శ్రీవల్లి’ అనే చిత్రాన్ని నిర్మించిన సునీత, రాజ్‌కుమార్ బృందావనం చాలాకాలం తర్వాత ఈ చిత్రాన్ని నిర్మించగా కేస్‌కే చైతన్య దర్శకత్వం వహిచాడు. జూన్ 6న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనను దక్కించుకుంది. ఇప్పుడీ సినిమా చప్పుడు లేకుండా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
కథ విషయానికి వస్తే.. నగరానికి దూరంగా ఓ రిమోట్ ఐలాండ్‌లోని ఓ గ్యాంబ్లింగ్ క్లబ్‌లో రూ.100 కోట్లకు పైగా ప్రైజ్‌మనీ కోసం ఆ గేమ్‌ల ఆడేందుకు పలువురు అక్కడికి వస్తారు. అయితే వారంతా ముందే ఫ్లాన్స్ వేసుకుని ఎలాగైనా చేసి అ డబ్బు కొట్టేయాలని చూస్తుంటారు. ఈ క్రమంలో కథ మలుపులు తిరుగుతూ, గన్ ఫైరింగ్స్, ఒకరిపై ఒకరు ఛీటింగ్ చేసుకుంటూ ఆట స్వరూపాన్నే మార్చుతుంటారు. ఈ నేపథ్యంలో మెజీషియన్ అయిన హీరో ఏంజెల్ వారితో ఎలా తలపడ్డాడు, తాను ఎలాంటి ఫ్లాన్లు వేశాడు, ఆ డబ్బును దక్కించుకోగలిగాడా లేదా, అక్కడి నుంచి ఎలా బయట పడ్డాడు అనే కథకథనాలతో సినిమా సాగుతుంది.
కథగా బావున్నా స్క్రాన్ ప్లే లోపం, కాస్త సాగదీసినట్లు ఉండంం ఈ సినిమాకు మైనస్. సెకండాఫ్ ఫర్వాలేదనిపించినా అక్కడక్కడ అనవసర గ్లామర్ ట్రీట్ కాస్త ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడీ చిత్రం సన్ నెక్ట్స్ (Sunnxt ) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. టైమ్పాస్ చేయాలనుకునే వారు, ఓ డిఫరెంట్ సినిమా చూడాలనుకునే వారు ఓ మారు ఈ సినిమాను ట్రై చేయొచ్చు. తెలుగుతో పాటు తమిళంలోనూ అందుబాటులో ఉంది.