Coolie Twitter Review: రజనీ కూలీ ఎలా ఉందంటే.. ట్విట్టర్ రివ్యూ
ABN , Publish Date - Aug 14 , 2025 | 05:42 AM
రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న కూలీ చిత్రం ఎన్నో అంచనాల మధ్య గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
భారీ అంచనాల మధ్య రజనీకాంత్ (Rajinikanth), లోకేశ్ కనగరాజ్ (Lokesh kanakaraj) కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న కూలీ (Coolie) చిత్రం ఎన్నో అంచనాల మధ్య గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే ఓవర్సీస్, ఆంధ్ర, తమిళనాడు లోని కొన్ని ప్రాంతాలలో కూలీ సినిమా షోలు పడిపోయాయి. దీంతో రజనీ ఫ్యాన్స్‌తో పాటు చాలామంది మూవీ లవర్స్ మొదటి షోనే చూసేయాలని పోటీ పడ్డారు. రాత్రనక, పగలనకా థియేటర్ల వద్ద బారులు తీరారు. అన్‌లైన్‌లో అయితే రికార్డ్ స్థాయిలో టికెట్ల విక్రయాలు జరిగాయి. అయితే ఇప్పటికే సినిమా చూసిన వారు చాలామంది తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.
కూలీ సినిమా టైటిల్ కార్డు నుంచే లోకి రజినీపై తన అభిమానాన్ని చూయించాడని, రజనీ 50 ఏళ్ల సినిమా లైఫ్‌ని తెలియజేసేలా చాలా ప్రత్యేకంగా అది డిజైన్ చాడని, అలాగే ఇందులోని నటులందరి ఇంట్రో సన్నివేశాలు సైతం డిఫరెంట్‌గా మంచి కిక్ ఇచ్చేలా ఉన్నాయని వ్రాసుకొస్తున్నారు. సత్యరాజ్ ఆయన కూతురు శృతిహసన్ కలిసి సైమన్ అక్రమాలపై ప్రారంభించిన ఓ మిషన్ ఫెయిల్ అవుతున్న సమయంలో సత్యరాజ్ ఫ్రెండ్ రజినీ ఎంట్రీ ఇవ్వడంతో కథ ఆసక్తికర మలుపులు తిరుగుతుందని అంటుననారు. ఈ క్రమంలో రజనీకి మిత్రుడిగా ఉపేంద్ర ఎంట్రీ, క్లైమాక్స్‌లో అమీర్ ఖాన్ ఆకట్టుకుంటారని చెబుతున్నారు. రెగ్యులర్ ప్రిడక్టబుల్ స్టోరీనే అయినప్పటికీ లోకేశ్ మరోమారు తన మార్క్ చూయించాడని అంటున్నారు.
ఇంకా ప్రచారంలోకి రాని రెండు సర్‌ఫ్రైజ్ క్యామియోలు కూడా ఉన్నాయని, మౌనికా సాంగ్ విజువల్‌గా కూడా కనుల విందుగా ఉందని, యాక్షన్ సీన్లన్నీ ది బెస్ట్‌గా డిజైన్ చేశరని పేర్కొంటున్నారు. ఇక పాలు సోసోగా ఉన్నా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమా రేంజ్‌లను అమాంతం పెంచేలా ఉందని, బక్కోడు ఇరగదీశాడని పోస్టులు పెడుతున్నారు. మొత్తంగా కొత్తదనం, కథ కాకపోయినప్పటికీ అంతా ముందే తెలుస్తున్నా ఎక్కడా ఆ ఫీల్ రాకుండా మంచి స్క్రీన్ ప్లేతో మాయ చేశాడని, నాగార్జున (Nagarjuna), రజనీల మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ అదిరిందని థియేటరికల్ ఎక్స్పీరియన్స్ ,ఏయాల్సిన మూవీ అన్ని స్పష్టం చేస్తున్నారు.