Upasana: రేవంత్‌ సర్కార్ కీలక నిర్ణ‌యం.. ఉపాసన కొణిదెలకు కొత్త‌ బాధ్యతలు

ABN , Publish Date - Aug 04 , 2025 | 02:30 PM

తెలంగాణ రాష్ట్ర క్రీడా అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది.

Upasana

తెలంగాణ రాష్ట్ర క్రీడా అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాయకత్వంలోని ప్రభుత్వం రూపొందించిన 2025 స్పోర్ట్స్ పాలసీ క్రీడా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని బలపరిచేలా తెలంగాణ స్పోర్ట్స్ హబ్ (Sports Hub of Telangana) బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్‌ను ఏర్పాటు చేసింది.

ఇప్ప‌టికే.. ఈ బోర్డు ఛైర్మన్‌గా లక్నో సూపర్ జెయింట్స్ యజమాని, ప్రముఖ పారిశ్రామికవేత్త సంజయ్ గోయెంకా నియమించబడగా, కో-ఛైర్మన్ పదవికి మెగాస్టార్ చిరంజీవి కోడలు, గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్ సతీమణి సీఎస్‌ఆర్‌ వైస్ చైర్‌పర్సన్‌, యూ ఆర్ లైఫ్‌ మేనేజింగ్ డైరెక్టర్ ఉపాసన కామినేని కోణిదెల(Upasana Kamineni Konidela)ను ప్ర‌భుత్వం ఎంపిక చేసింది.

upasana

ఇక‌.. బోర్డు సభ్యులుగా సన్ టీవీ నెట్‌వర్క్ అధినేత్రి కావ్య మారన్, మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, ఫుట్‌బాల్ స్టార్ భైచుంగ్ భూటియా, ఒలింపిక్ స్వర్ణ విజేత అభినవ్ బింద్రా, టెక్నాలజీ రంగ ప్రముఖులు రవికాంత్ రెడ్డి తదితరులు సేవలందించనున్నారు.

తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ కో-ఛైర్మన్ గా నియ‌మించ‌డంపై ఉపాసన ఆనందం వ్యక్తం చేస్తూ సోష‌ల్ మీడియా ద్వారా సీఎం రేవంత్ రెడ్డి, ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతూ .. తెలంగాణను గ్లోబల్ స్పోర్ట్స్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేయడానికి ఇది నాకు ఒక గొప్ప అవకాశం. సీఎం రేవంత్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అని, ప్రభుత్వ – ప్రైవేట్ భాగస్వామ్యంతో దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ఇది తొలి మెట్టు అని పేర్కొన్నారు.

upasana


తెలుగులో.. దుల్క‌ర్ మ‌రో సినిమా! షూటింగ్ స్టార్ట్

Jatadhara: సుధీర్ బాబు, సోనాక్షి.. అద‌ర‌గొట్టారుగా

Allu Aravind: ప‌వ‌న్ క‌ల్యాణ్.. మహావతార్ న‌ర‌సింహా చూడాలి

మంచు విష్ణుకి.. ఏమైంది! క‌న్న‌ప్ప త‌ర్వాత‌.. ఇలా అయ్యాడేంటి

Rajinikanth: నాకు.. సత్యరాజ్‌కు అభిప్రాయ భేదాలు నిజ‌మే!

Updated Date - Aug 04 , 2025 | 04:00 PM