సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kishkindhapuri: కిష్కింద‌పురి.. ప్రీమియ‌ర్ టాక్ రివ్యూ! బెల్లంకొండ హిట్ కొట్టాడా

ABN, Publish Date - Sep 11 , 2025 | 10:17 AM

భైర‌వం సినిమాతో నిరాశ ప‌ర్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా న‌టించిన మ‌రో కొత్త చిత్రం కిష్కింద‌పురి.

Kishkindhapuri

ఇటీవ‌ల భైర‌వం సినిమాతో నిరాశ ప‌ర్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) హీరోగా న‌టించిన మ‌రో కొత్త చిత్రం కిష్కింద‌పురి (Kishkindhapuri). అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ (Anupama Parameswaran) క‌థానాయుక‌గా న‌టించ‌గా కౌశిక్‌ పెగళ్లపాటి (Kaushik Pegallapati) దర్శకుడు. షైన్ స్క్రీన్స్ (Shine Screens) బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించాడు. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 12 శుక్ర‌వారం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ఎదుట‌కు రానుంది. ఈ నేపథ్యంలో ప్ర‌మోష‌న్స్ నుంచి భిన్నంగా ఫ్లాన్ చేసిన మేక‌ర్స్ సినిమాను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు అనేక ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేశారు.

అంతేకాదు హీరో బెల్లంకొండ ఓ అడుగు ముందుకు వేసి సినిమా న‌డుస్తున్న సేపు ఎవ‌రైనా ఫోన్ ప‌ట్టుకుంటే నేను సినిమాల నుంచే త‌ప్పుకుంటాన‌ని ఎవ‌రు చేయ‌లేని స్టేట్‌మెంట్ ఇవ్వ‌డం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. ఈ క్ర‌మంలో రెండు రోజుల ముందే మీమ‌ర్స్‌, మీడియాకు ప్రీమియ‌ర్స్ వేసి మ‌రో డేర్ చేసింది చిత్ర బృందం. ఈ నేప‌థ్యంలో చాలామంది ఇప్ప‌టికే సినిమాను చూసి సామాజిక మాధ్య‌మాల్లో పంచుకుంటున్నారు.

ఇక‌ విష‌యానికి వ‌స్తే.. 2 గంటల 5 నిమిషాల నిడివితో స్టార్ట్ అయిన సినిమా తొలి 10 నిమిషాలు సెట‌ప్ కోసం వినియోగించుకున్నార‌ని, ఆత‌ర్వాతే సినిమా స్టార్ట్ అయి పీక్స్ కు వెళ్లింద‌ని, ఇంట‌ర్వెల్ బ్యాంగ్ సైతం అదిరిపోయింద‌ని అంటున్నారు. ముఖ్యంగా సెకండాఫ్, జంప్ స్కేర్స్, భ‌య‌పెట్టే స‌న్నివేశాలు స్ట‌న్నింగ్‌గా ఉన్నాయ‌ని అంటున్నారు. విజువ‌ల్స్‌, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, ట్విస్టులు ఎక్ట్రార్డిన‌రీగా ఉన్నాయ‌ని ఆకాశానికెత్తేస్తున్నారు.

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్టింగ్ మెరుగు ప‌డింద‌ని, హాస్ప‌ట‌ల్ సీన్‌లో అనుప‌ప యాక్టింగ్ ఫీక్స్ లో ఉంద‌ని, ముఖ్యంగా ద‌య్యంగా మారే స‌న్నివేశం సినిమాకే హైలెట్ అని పోస్టులు పెడుతున్నారు. అంతేగాక ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్, ప్రీ క్లైమాక్స్ సెటప్, విలన్ పెర్ఫార్మన్స్

బాగున్నాయని కానీ క్లైమాక్స్ రొటీన్‌గా ఉండడం మైన‌స్ అని కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే కిష్కింద‌పురి (Kishkindhapuri) సినిమాతో బెల్లంకొండ‌ చాలా విరామం త‌ర్వాత మంచి హిట్ కొట్టాడ‌ని చెబుతున్నారు.

Updated Date - Sep 11 , 2025 | 10:45 PM