Kingdom: టికెట్‌పై.. రూ.75 అదనం! ప్రభుత్వం అనుమతి
ABN , Publish Date - Jul 24 , 2025 | 05:14 PM
విజయ్ దేవరకొండ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘కింగ్‌డమ్’ కు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
ఫ్యామిలీస్టార్ వంటి డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘కింగ్‌డమ్’ (Kingdom). సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sitara Entertainments) సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించగా జర్సీఫేమ్ గౌతమ్ తిన్ననూరి (Gautham Tinnanuri) దర్శకత్వం వహించాడు. భాగ్యశ్రీ భోర్సే (Bhagyasri Borse) కథానాయికగా నటించగా సత్యదేవ్ కీలక పాత్రలో పోషించాడు. ఇప్పటికే అనేక మార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ నెల జూలై 31న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవనుంది.
ఈ నేపథ్యంలో తాజాగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఈ చిత్రానికి ప్రత్యేక టికెట్ రేట్ల పెంపుకి అనుమతిని ఇస్తూ జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరపై రూ.50, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.75 అదనంగా వసూలు చేయనున్నారు. ఈ పెరిగిన ధరలు పది రోజులు (జూలై 31 నుంచి ఆగష్టు 9)వరకు అమలులో ఉండనున్నాయి. ఇదిలాఉండగా జూలై 26న తిరుపతిలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.