సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Toxic: మరో వంద రోజుల్లో.. యశ్ 'టాక్సిక్' విధ్వంసం ఖాయం!

ABN, Publish Date - Dec 09 , 2025 | 11:53 AM

మరో వంద రోజుల్లో యశ్, రుక్మిణీ వసంత్ జంటగా నటిస్తున్న 'టాక్సిక్' మూవీ విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

Toxic: A Fairytale for Grown-ups

ఇండియన్ సినిమా హద్దుల్ని చెరిపేసి, అంతర్జాతీయ స్థాయిలో మన సత్తాను చాటేందుకు రాకింగ్ స్టార్ యశ్‌ (Yash) ప్రస్తుతం ‘టాక్సిక్ - ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ మూవీ చేస్తున్నాడు. దీనితో పాటే అతను 'రామాయణ్‌' (Ramayan) చిత్రంలో రావణాసురుడి పాత్రను పోషిస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ సమాంతరంగా జరుగుతున్నాయి. అయితే కొన్ని రోజులుగా 'టాక్సిక్' (Toxic) మూవీ దర్శకురాలు గీతు మోహన్ దాస్ కు యశ్ కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని, దాంతో షూటింగ్ కు అంతరాయం ఏర్పడిందని, అనుకున్న సమయానికి ఈ సినిమా విడుదల కాదని... ఇలా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయాలపై చిత్ర నిర్మాతలు వెంకట్ కె నారాయణ, యశ్ స్పందించలేదు. తాజాగా ఈ సినిమా మరో వంద రోజుల్లో ముందు అనుకున్న విధంగా మార్చి 19న విడుదల కాబోతోందని ఓ పోస్టర్ ద్వారా తెలియచేశారు. దాంతో విమర్శకుల నోటికి సైలెంట్ గా వీరు తాళం వేసినట్టయ్యింది.


అలానే నెల రోజుల క్రితం కూడా 'టాక్సిక్' షూటింగ్ తుది దశకు చేరుకుందని, బెంగళూరులో జరుగుతోందని తెలిపారు. ఆ షెడ్యూల్ కు సంబంధించిన వివరాలున మాత్రం ఇంకా తెలియచేయలేదు. అయితే నూతన సంవత్సర ఆరంభం నుండి భారీ ఎత్తున ప్రమోషన్స్ చేయబోతున్నట్టుగా చెప్పారు. ఇందులో యశ్ సరసన రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్నో లేయర్స్ తో ఉన్న ఇలాంటి రా అండ్ రస్టిక్ మూవీ ఇంతవరకూ కన్నడతో పాటు మరే భారతీయ భాషల్లోనూ రాలేదని ఆమె చెబుతోంది. దర్శకురాలు గీతు మోహన్ దాస్ కూ ఈ సందర్భంగా రుక్మిణీ వసంత్ కితాబిచ్చింది. ఆమె విజన్ ఎంతో బోల్డ్ గా ఉంటూనే హృద్యంగా సాగుతుందని తెలిపింది.

కన్నడ, ఆంగ్ల భాషలలో చిత్రీకరించబడుతున్న 'టాక్సిక్' తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషలలో డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జాతీయ అవార్డు, గ్లోబల్ ఫిల్మ్ మేకింగ్ అవార్డుతో సహా అనేక ప్రశంసలను అందుకున్న గీతు మోహన్‌దాస్ మరోసారి వండర్ ఫుల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.

Also Read: Nivetha Pethuraj: బాయ్ ఫ్రెండ్‌కు.. గుడ్ బై! ఎంగేజ్మెంట్.. క్యాన్సిల్‌ చేసుకున్న‌ నివేదా పేతురాజ్

Also Read: Stephen OTT: వామ్మో.. ఎవడ్రా వీడు ఇలా ఉన్నాడు! ఓటీటీలో.. బుర్ర‌పాడు చేసే సైకో థ్రిల్ల‌ర్‌

Updated Date - Dec 09 , 2025 | 12:00 PM