Stephen OTT: వామ్మో.. ఎవడ్రా వీడు ఇలా ఉన్నాడు! ఓటీటీలో.. బుర్రపాడు చేసే సైకో థ్రిల్లర్
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:14 AM
ఇటీవల థియేటర్లలో రిలీజ్ చేయకుండా డైరెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన తమిళ సినిమా స్టీఫెన్ (Stephen) టోటల్ ఓటీటీనే షేక్ చేస్తోంది.
కథ విషయానికి వస్తే.. నటి కావాలని ఆడిషన్స్ కోసం తన దగ్గరకు వచ్చిన 10 మంది అమ్మాయిలను ఓ ప్రశ్న అడిగి వారిలో తొమ్మిది మందిని అక్కడే చంపేస్తాడు స్టీఫెన్. ఈ క్రమంలో పోలీసులు రంగంలోకి కేసు పరిశోధిస్తుండగానే సీరియల్ కిల్లర్ స్టీఫెన్ స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోతాడు. ఆపై అతన్ని కోర్టులో హజరుపరచగా అతని మానసిక పరిస్తితిని అంచనా వేసి రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని జడ్జి తీర్పు ఇస్తాడు. ఈ క్రమంలో పోలీసాఫీసర్ మైఖెల్, ఓ ప్రత్యేక మానసిక వైద్యురాలు ఇద్దరు కలిసి స్టీఫెన్‌ను ప్రశ్నించి అతని గతాన్ని తెలుసుకుని, అతను అంతమందిని ఎందుకు చంపాడు, అలా ఎందుకు తయారయ్యాడు ఎందుకు లొంగిపోయాడనే విషయాలను తెలసుకునేందుకు రంగంలోకి దిగుతారు.
ఈ నేపథ్యంలో స్టీఫెన్ తన ఫ్లాష్ బ్యాక్‌లో కీలక అంశాలను ఒక్కొక్కటిగా తల్లిదండ్రులు, ప్రేమ, పెళ్లి, భార్య గురించి, తన తల్లి ఎంత కఠినంగా ఉండేది, తండ్రిని, తనను ఎలా చూసేది అనే విస్తూ పోయే అంశాలు చెప్పడం ప్రారంభిస్తాడు. అయితే.. ఓ వైపు డాక్టర్ ఇంటరాగేట్ చేస్తుండగా మరోవైపు స్టీఫెన్ చెప్పేవి వాస్తవాలేనా అని తెలుసుకునేందుకు స్టీఫెన్ ఫ్యామిలీ గురించి తెలిసిన వాళ్ల దగ్గర ఎస్సై మైఖెల్ తన స్టైల్‌లో ఎంక్వైరీ చేయడం ప్రారంభిస్తాడు. అక్కడ మరికొన్ని షాకింగ్ విషయాలు కొత్తగా బయట పడుతుంటాయి. ఇక్కడ వీరు చేసే ఇన్వేస్టిగేషన్‌కు, ఆక్కడ డాక్టర్ వద్ద స్టీఫెన్ చెప్పే అంశాల మధ్య వైరుధ్యాలు కనిపిస్తుంటాయి. ఇంతకు అక్కడ వచ్చిన తేడాలు ఏంటి, స్టీఫెన్ తల్లిదండ్రులు, భార్యను ఎవరు చంపారు, ఎందుకు చంపారు, తొమ్మిది మందిని చంపినట్లు అంగీకరించిన స్టీఫెన్ పదో అమ్మాయిని ఎందుకు వదిలేశాడు, చంపిన ఆ తొమ్మిది మందిని ఏం చేశాడనే ఆసక్తికర కథా కథనంతో సినిమా సాగుతుంది.
ఇప్పటికే సీరియల్ కిల్లర్ జానర్‌లో మనం చూసినప్పటికీ ఈ మూవీ మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఇంతవరకు కిల్లర్లను పట్టుకునేందుకు పోలీసుల వేట అనే లైన్ మీదనే వందల సినిమాలు రాగా ఇందులో మాత్రం కిల్లర్ ముందుగానే సరెండర్ అవడం , ఆపై నడిచే స్టోరీ ఆధారంగానే సినిమా నడుస్తుంది. ఎక్కడా బోర్ అనే ఫీల్ రాకుండా ప్రతీ సీన్ చైర్‌కు హుక్ అయ్యేలా చేస్తూ సీటులో కూర్చో బెడుతుంది. ఇక ఆఖర్లో వచ్చే ట్విస్టుకైతే బుర్రలు పాడు ఖావడం మాత్రం ఖాయం. అంత ఎఫెక్టివ్‌గా ఆ ట్విస్టు ఉండి వీక్షకులకు అదిరిపోయే షాక్ ఇస్తుంది. ఇప్పుడీ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ అంఉబాటులో ఉంది. మంచి థ్రిల్లర్లు ఇషట్పడే వారు తప్పక చూసి తీరాల్సిన సినిమా ఇది. సినిమాలో ఎక్కడ అసభ్యత, అశ్లీల సన్నివేశాలు లేవు గానీ ఒకట్రెండ్ హత్యల సమయంలో రక్తపాతం కాస్ట డిస్ట్రబ్ చేసే అవకాశం ఉంది. ఆ ఒక్క దానిని భరిస్తే కుటుంబంతో ఈ సినిమాను చూసేయవచ్చు.