Nivetha Pethuraj: బాయ్ ఫ్రెండ్‌కు.. గుడ్ బై! ఎంగేజ్మెంట్.. క్యాన్సిల్ చేసుకున్న నివేదా పేతురాజ్
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:22 AM
ప్రముఖ నటి నివేదా పేతురాజ్ ఎంగేజ్ మెంట్ ఆగస్ట్ లో రాజ్ హిత్ ఇబ్రాన్ తో జరిగింది. అయితే ఇప్పుడు వీరిద్దరూ సోషల్ మీడియా అకౌంట్ల నుండి తమ ఎంగేజ్ మెంట్ ఫోటోలను తొలగించడంతో రక రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరికీ బ్రేకప్ అయ్యిందని నెటిజన్స్ భావిస్తున్నారు.
ప్రముఖ కథానాయిక నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) ఎంగేజ్ మెంట్ రాజ్ హిత్ ఇబ్రాన్ తో ఈ యేడాది ఆగస్ట్ మాసంలో జరిగింది. చాలా సీక్రెట్ గా ఈ విషయాన్ని ఉంచిన నివేదా ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా దీన్ని తెలియచేసింది. దుబాయ్ లో స్థిరపడిన మలయాళీ బిజినెస్ మ్యాన్ తో నివేద ఈ యేడాది చివరిలో ఏడు అడుగులు నడుస్తుందని అంతా అనుకున్నారు. అయితే చిత్రంగా మొన్న క్రికెటర్ స్మృతి మందాన (Smriti Mandhana) చివరి నిమిషంలో తన వివాహాన్ని రద్దు చేసుకున్నట్టుగా నివేదా పేతురాజ్ పెళ్ళి కూడా రద్దు అయినట్టు తెలుస్తోంది.
తెలుగులో పలు చిత్రాలలో నటించడంతో పాటు ఓటీటీ మూవీస్, వెబ్ సీరిస్ లలో సైతం నటించింది నివేదా పేతురాజ్. అంతే కాకుండా కార్ రేసింగ్ లోనూ తన సత్తాను చాటింది. తెలుగులో రెండేళ్ళ క్రితం చివరగా విశ్వక్ సేస్ 'దాస్ కా ధమ్కీ' (Das Ka Dhamki) లోనూ, 'బూ' (Boo) సినిమాల్లోనూ ఆమె నటించింది. అలానే గత యేడాది 'పరువు' (Paruvu) అనే వెబ్ సీరిస్ లో చివరగా దర్శనమిచ్చింది. ఆ తర్వాత నటనకు దూరంగా ఉంది. బహుశా వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యమిస్తూ, వైవాహిక జీవితంలో స్థిరపడాలని నివేదా భావించి ఉండొచ్చనే అంతా అనుకున్నారు. ఆగస్ట్ లో ఆమె తన ఎంగేజ్ మెంట్ గురించి చెప్పిప్పుడు కూడా అదే భావనలో ఉన్నారు. అయితే తాజాగా ఇటు నివేదా పేతురాజ్, అటు ఆమె కాబోయే భర్త రాజ్ హిట్ ఇబ్రాన్ కూడా ఒకరికి ఒకరు సోషల్ మీడియాలో వారి ఫోటోలను డిలీట్ చేయడంతో దాల్ మే కుచ్ కాలా హై అంటున్నారు నెటిజన్స్. నివేదా పేతురాజ్ సైతం ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు బిగ్ బాస్ కంటెస్ట్ తో రాజ్ హిత్ ఇబ్రాన్ ఎంగేజ్ మెంట్ జరిగిందనే వార్తలు వస్తున్నాయి. ఇందులోని నిజాల నిజాల మాట ఎలా ఉన్నా... నివేదా పేతురాజ్ జీవితంలో మాత్రం ఇప్పుడో కష్టకాలం నడుస్తోందనిపిస్తోంది.
Also Read: Akhanda2: అఖండ2.. ఎంత పని చేసింది! బాలయ్య సినిమా ఎఫెక్ట్.. ఆ సినిమాలు వాయిదా
Also Read: OTT Movies: ఈ వారం.. లేటెస్ట్ ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు