scorecardresearch

Toxic: ముంబైలో నయనతార...

ABN , Publish Date - Apr 03 , 2025 | 01:21 PM

కన్నడ స్టార్ హీరో యశ్ లేటెస్ట్ మూవీ 'టాక్సిక్' తాజా షెడ్యూల్ లో పాల్గొనబోతోంది నయన్. అందుకోసం తన ఇద్దరు కవలల్ని తీసుకుని మరి నయన్ ముంబై చేరింది.

Toxic: ముంబైలో నయనతార...

సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayantara) నాన్ స్టాప్ గా తన చిత్రాల షూట్ లో పాల్గొంటోంది. ఇటీవలే 'డియర్ స్టూడెంట్స్' (Dear Students) మూవీని పూర్తి చేసుకున్న నయనతార ఇప్పుడు యశ్ (Yash) ప్రతిష్ఠాత్మక చిత్రం 'టాక్సిక్ : ఏ ఫెయిరీ డేల్ ఫర్ గ్రోన్స్ -అప్స్' (Toxic: A Fairy Tale for Grown-Ups) షూటింగ్ కోసం ముంబై చేరింది. తనతో పాటు ఇద్దరు కవలపిల్లలను తీసుకుని ముంబై ఎయిర్ పోర్ట్ లో దిగిన నయన్ ఫోటోలను పాపరాజీలు కప్చర్ చేశారు. గత యేడాదిలోనే 'టాక్సిక్' మూవీ షూటింగ్ మొదలైంది. నయనతార కూడా ఆ షూట్ లో పాల్గొంది.


నయనతారతో పాటు 'టాక్సిక్' మూవీలో కియారా అద్వానీ, డారిల్ డిసెల్వా, అక్షయ్ ఓబెరాయ్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాను కన్నడ, ఇంగ్లీష్‌ భాషల్లో గీతు మోహన్ దాస్ తెరకెక్కిస్తోంది. వచ్చే యేడాది మార్చి 19న ప్రధాన భారతీయ భాషల్లో మూవీని రిలీజ్ చేయబోతున్నారు. యశ్‌ తో కలిసి ఈ సినిమా వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నాడు. 'టాక్సిక్' తాజా షెడ్యూల్ షూటింగ్ ముంబై, గోవా, బెంగళూరులో జరుగబోతోంది. కొన్నేళ్ళ క్రితం జరిగిన కొన్ని నిజ సంఘటన ఆధారంగా గోవాలోని డ్రగ్స్ రాకెట్ నేపథ్యంలో 'టాక్సిక్' తెరకెక్కుతోంది. 'టాక్సిక్', 'డియర్ స్టూడెంట్స్' చిత్రాలతో పాటు నయనతార 'మన్నంగట్టి', 'మూకూతి అమ్మన్ -2' తదితర సినిమాలలో నటిస్తోంది.

Also Read: Siddu: జాక్... కొంచెం క్రాక్ మాత్రమే కాదు తేడా కూడా...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 03 , 2025 | 01:21 PM