Drugs Case: కేసు నుంచి.. నటులను తప్పించేందుకు రూ.50 లక్షల లంచం
ABN , Publish Date - Jul 24 , 2025 | 10:55 PM
మాదకద్రవ్యాలను కొనుగోలు చేసిన నటులను అరెస్టు చేయకుండా ఉండేందుకు పోలీసులు రూ.50 లక్షల మేరకు లంచం తీసు కున్నట్టు డ్రగ్ సప్లయర్ ప్రదీప్ కుమార్ వాంగ్మూలం ఇచ్చాడు.
తమ దగ్గర కొకైన్ వంటి మాదకద్రవ్యాలను కొనుగోలు చేసిన నటులను అరెస్టు చేయకుండా ఉండేందుకు కొందరు పోలీసులు రూ.50 లక్షల మేరకు లంచం తీసు కున్నట్టు డ్రగ్ సప్లయర్ ప్రదీప్ కుమార్ (Pradeep Kumar ) వాంగ్మూలం ఇచ్చాడు. దీనిపై లోతైన దర్యాప్తు చేపట్టిన ఉన్నతాధికారులు.. క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ ఇన్స్పెక్టర్, ఇద్దరు ఎస్ఐలపై చర్యలు తీసుకున్నారు. ఈ ముగ్గురినీ వీఆర్‌కు ఎటాచ్ చేశారు. మే 22న నుంగంబాక్కంలోని ఓ హోటల్లో రెండు గ్రూపుల మధ్య గొడవ జరగ్గా, దీనికి సంబంధించి నుంగంబాక్కం పోలీసులు అన్నాడీఎంకే నేత ప్రసాద్, ఈసీఆర్ రాజా, అజయ్ వాండయార్, రౌడీ సునామీ సేతు సహా మొత్తం 9 మందిని అరెస్టు చేశారు. ఈ గొడవకు కారణాలపై పోలీసులు లోతుగా ఆరా తీయగా, ఇందులో సేలంకు చెందిన ప్రదీప్ కుమార్ అలియాస్ బ్రిట్టో (38) వద్ద అధిక మొత్తంలో కొకైన్ కొనుగోలు చేసి నటుడు శ్రీకాంత్, శ్రీకృష్ణలకు సరఫరా చేసినట్టు ప్రసాద్ వెల్లడిం చాడు. ఆ తర్వాత ప్రదీప్ కుమార్ సహా ఆఫ్రికాకు చెందిన జాన్ (38)ను జూన్ 17న అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారం మేరకు హీరో శ్రీరామ్, శ్రీకృష్ణలను అరెస్టు చేయగా, ఆ తర్వాత వీరిద్దరు బెయిల్ పై విడుదలయ్యారు. Chennai Drug Case
అయితే ఈ కేసులో లోతుగా విచారణ జరిపేందుకు ట్రిప్లికేన్ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్, థౌజండ్ లైట్ పోలీస్ స్టేషన్లో పనిచేసే ఇద్దరు ఎస్బలను ఉన్నతాధికారులు ఎంపిక చేశారు. ఈ బృందం ప్రసాద్, జాన్లను కస్టడీలోకి తీసుకుని విచా రించగా, అనేక మంది సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు వెల్లడించారు. వారిచ్చిన సమాచారం మేరకు మరో 26 మందిని అరెస్టు చేశారు. అలాగే, ప్రదీప్ కుమార్, నైజీరియాకు చెందిన సారా కొమామాను కస్టడీలోకి తీసుకుని, వారిని ప్రశ్నించారు. దీంతో నటీన టులకు డ్రగ్స్ సరఫరా చేసేందుకు విరుగంబాక్కంకు చెందన జెస్ వీర్ అలియాస్ కెవిన్ అనే వ్యక్తిని సహాకుడిగా నియమించుకున్నట్టు వారు పోలీసులకు చెప్పారు. అతడి ద్వారా శ్రీరామ్తో పాటు పలు వురు సినీ ప్రముఖులకు మాదక ద్రవ్యాలు సరఫరా చేసినట్టు వెల్ల డించిన విషయం తెలిసిందే. Actors Drug Controversy
ఈ నేపథ్యంలో తమను ఆరెస్టు చేయ కుండా ఉండేందుకు పలువురు నటీనటులు ప్రదీప్ కుమార్‌కు రూ.50 లక్షల వరకు ఇవ్వగా, వాటిని పోలీసులకు అందజేశారు. దీంతో ప్రత్యేక బృందం పోలీసులు ప్రదీప్ కుమార్‌ను నామమాత్రంగా విచారణ జరిపి చేతులు దులుపుకున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. పైగా ఈ అంశంపై మరింత లోతుగా డిప్యూటీ కమిషనర్ విచారణ జరుపుతున్నారు. ఆదేసమయంలో లంచం తీసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో సీఐ, ఇద్దరు ఎస్ఐలను వీఆర్కు పంపించారు. అలాగే ఈ కేసు నుంచి తప్పించుకున్న సటీ నటులు ఎవరనే అంశంపై ఆరా తీస్తున్నారు.