Lokesh Kanagaraj: అనిరుధ్ నా తమ్ముడు... కలిస్తే మ్యాజిక్కే...

ABN , Publish Date - Aug 11 , 2025 | 03:14 PM

వాళ్ళిద్దరూ కలిస్తే ఏ సినిమా చేసినా బ్లాక్ బస్టర్ కావాల్సిందే. ఆయన డైరెక్షనే అలా ఉంటుందో... లేక దానికి ఇచ్చే సంగీతమే మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో తెలియదు కానీ ఆ కాంబో బిగ్ స్క్రీన్ ను షేక్ చేస్తూ ఉంది. అందుకే ఆ సంతోషాన్ని ఆపుకోలేక ఆ డైరెక్టర్ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకుని.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారాడు.

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన మోస్ట్ అవైటెడ్ 'కూలీ' (Coolie ) సినిమా ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. కోలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇప్పటికే బయటకు వచ్చిన ప్రమోషన్ కంటెంట్ ను చూసిన ఫ్యాన్స్ ఈసారి సూపర్ స్టార్ హిట్ కొట్టడం పక్కా అని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. పైగా లోకేష్ ఇప్పటి వరకూ ఒక్క ఫ్లాప్ కూడా ఇవ్వకపోవడంతో ఈ సినిమా రూ. 1000 కోట్ల బొమ్మ అని భావిస్తున్నారు. విడుదల వేళ తాజాగా లోకేష్ కనగరాజ్ ఎక్స్ లో పెస్టిన పోస్టు వైరల్ గా మారింది.


తన క్లోజ్ ఫ్రెండ్ ... మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) తో కలిసి ఉన్న ఫోటోలు పంచుకున్నాడు డైరెక్టర్ లోకేష్. అనిరుధ్ ను సొంత సోదరుడు గా అభివర్ణించిన డైరెక్టర్.. తాము కలిసి ప్రయాణం మొదలుపెట్టిన రోజుల నుంచి ఇప్పుడు నాలుగోసారి కలిసి పని చేస్తున్నామని తెలిపాడు. ప్రతీసారి ఈ అనుభవం అద్భుతంగా ఉంటుందని, ఇప్పుడు 'కూలీ'తో మరోసారి మ్యాజిక్ చేయబోతున్నట్లు చెప్పాడు. అయితే లోకేష్ పంచుకున్న ఫోటోల్లో రజనీకాంత్ చిత్రాలు బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించడం ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇక ఇప్పటికే బయటకు వచ్చిన పాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా 'మోనిక' సాంగ్ దుమ్మురేపుతోంది.

'కూలీ' ఆగస్టు 14న భారీ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతోంది. గ్లోబల్ బాక్సాఫీస్‌లో ప్రీ-సేల్స్ ఇప్పటికే రూ. 50 కోట్లు దాటడం ఈ చిత్రం పట్ల ప్రేక్షకుల ఆసక్తిని తెలియజేస్తోంది. టికెట్స్ అలా ఒపెన్ అవ్వగానే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. పైగా రజనీ సినిమా కావడంతో టికెట్ ధర వేలల్లో ఉన్నా కొనేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారట. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నాగార్జున (Nagarjuna), ఆమిర్ ఖాన్ (Aamir Khan), ఉపేంద్ర (Upendra), సౌబిన్ షాహిర్ (Soubin Shahir), శ్రుతి హాసన్ ( Shruti Haasan) వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా రజనీకాంత్ ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్‌గా నిలవనుంది. మరీ ఫ్యాన్స్ పెంచుకున్న అంచనాలను 'కూలీ' ఎంతవరకు నెలబెట్టుకుంటుందో చూడాలి.

Read Also: Rana Daggubati - ED Office: ఈడీ విచారణకు హాజరైన రానా

Read Also: Hrithik Roshan - War 2: తారక్‌ని గమనించా.. నేర్చుకున్నా.. అదే ఫాలో అవుతా..

Updated Date - Aug 11 , 2025 | 03:14 PM

Rajini - Satyaraj: నాలుగు దశాబ్దాల ఎడబాటును చెరిపేసిన 'కూలీ'

Coolie Emotional Role: అందరికీ కనెక్ట్‌ అయ్యే పాత్ర

Coolie Vs War -2: ఒకే రోజు రెండు పెద్ద చిత్రాల వార్ 

Coolie: 'ఎ' సర్టిఫికెట్ వచ్చినా.. రూ. 1000 కోట్లు పక్కా

Coolie Powerhouse Song: కూలీ నుంచి ‘పవర్‌హౌస్’ లిరిక్ వీడియో.. రజనీ ఫ్యాన్స్‌లో ఫుల్ హైప్