Coolie Emotional Role: అందరికీ కనెక్ట్ అయ్యే పాత్ర
ABN , Publish Date - Jul 27 , 2025 | 02:50 AM
‘గబ్బర్‌సింగ్’, ‘రేసుగుర్రం’, ‘ఎవడు’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శ్రుతి హాసన్. ఆమె కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కూలీ’. రజనీకాంత్, నాగార్జున, ఆమిర్‌ఖాన్ ప్రధాన పాత్రధారులుగా...
‘గబ్బర్‌సింగ్’, ‘రేసుగుర్రం’, ‘ఎవడు’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శ్రుతి హాసన్. ఆమె కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కూలీ’. రజనీకాంత్, నాగార్జున, ఆమిర్‌ఖాన్ ప్రధాన పాత్రధారులుగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 14న ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రుతీహాసన్ మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. ‘‘ఓ ఆల్బమ్ కోసం లోకేశ్‌ను కలసినప్పుడు ‘కూలీ’లో నా పాత్ర గురించి చెప్పారు. వినగానే నచ్చేసింది. అందరూ కనెక్ట్ అయ్యే పాత్ర ఇది. మంచి భావోద్వేగాలతో నిండిన ఈ రోల్ నా కెరీర్‌లోనే ప్రత్యేకమైనది. రజనీ సార్‌తో కలసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన పోషించిన దేవ పాత్ర సినిమాకు ప్రత్యేకాకర్షణగా నిలుస్తుంది. నాగార్జున విలన్ పాత్రలో అద్భుతంగా నటించారు. లోకేశ్ విజన్, టేకింగ్ ఈ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది. ‘కూలీ’ ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుంది’’ అని చెప్పారు.
Sunday Tv Movies: ఆదివారం, జూలై 27న.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
Deviyani Sharma: అందాలను ఈ రేంజ్ లో ఆరబోస్తున్నా పట్టించుకోరేంటయ్యా