Rana Daggubati - ED Office: ఈడీ విచారణకు హాజరైన రానా

ABN , Publish Date - Aug 11 , 2025 | 02:54 PM

రానా దగ్గుబాటి (Rana Daggubati) సోమవారం ఈడీ విచారణకు హాజరయ్యారు.

రానా దగ్గుబాటి (Rana Daggubati) సోమవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. నిషేదించిన బెట్టింగ్‌ యాప్‌లకు ప్రచారం చేసిన వివాదంలో విచారణకు హాజరు కావాలనిఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో గతంలో విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేసినప్పటికీ బిజీ షెడ్యూల్‌ ఉన్న నేపథ్యంలో రానా కొంత సమయం కోరారు. అందుకు దర్యాప్తు సంస్థ అంగీకరించి ఆగస్టు 11న హాజరుకావాలని సమన్లు ఇచ్చింది. రానా ఈ రోజు ఈడీ అధికారుల ముందు హాజరై, తన ఐదేళ్ల బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను సమర్పించారు. జంగిల్ రమ్మీ అనే బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసిన ఆరోపణలపై ఈడీ అధికారులు ఆయన స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తున్నారు.

ఇంకా ఈ కేసులో ప్రకాశ్‌రాజ్‌, విజయ్‌ దేవరకొండను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ నెల 13న విచారణకు రావాలని మంచు లక్ష్మీకి ఈడీ అధికారులు పంపారు.

ALSO READ: Jr Ntr: ఎవరు ఎన్ని అనుకున్నా.. బొమ్మ అదిరిపోయింది .. ఇక నాలుగు రోజులే

War2 Event: నాగ‌వంశీ వ్యాఖ్య‌లు.. సోష‌ల్ మీడియాలో ర‌చ్చ‌

Cinema Bandh: కందుల దుర్గేష్ తో నిర్మాతల సమావేశం

Kamal Haasan: కమల్ హాసన్‌పై.. సీరియ‌ల్‌ ఆర్టిస్ట్‌ హత్యా బెదిరింపులు!

Kothapallilo Okappudu: ఆ ఓటీటీకి.. నాటు స‌ర‌సం సినిమా! ఎప్ప‌టినుంచంటే?

Updated Date - Aug 11 , 2025 | 04:10 PM