Coolie Powerhouse Song: కూలీ నుంచి ‘పవర్‌హౌస్’ లిరిక్ వీడియో.. రజనీ ఫ్యాన్స్‌లో ఫుల్ హైప్
ABN , Publish Date - Jul 23 , 2025 | 11:21 AM
కూలీ నుంచి ‘పవర్‌హౌస్’ లిరిక్ వీడియో.. మాస్ బీట్స్‌తో సోషల్ మీడియాలో హంగామా
థలైవర్ రజనీకాంత్ (Rajinikanth) ప్రధాన పాత్రలో, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియన్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం కూలీ. నాగార్జున, అమీర్ ఖాన్, షౌబీన్ షాహీర్, శీతి హాసన్ కీలక పాత్రల్లో నటించారు. ఆగష్టు15న మరో 20 రోజుల్లో థియేటర్లకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రచార కార్యక్రమాలు ప్రారంభించి హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే విడుదల చేసిన పాటలు సినిమాపై మంచి హైప్ తీసుకు రాగా గత వారం విడుదల చేసి మోనిక సాంగ్ టోటల్ ఇండియానే షేక్ చేస్తుంది.
అయితే.. తాజాగా హైదరాబాద్‌లో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించి పవర్ హౌస్ (Powerhouse) అనే వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. అరివు ఈ పాటకు సాహిత్యం అందించగా సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ (Anirudh Ravichander) తతో కలిసి ఆలపించారు. ఫుల్ బాస్ బీట్స్, ర్యాప్ టచ్ తో సాగే ఈ పాట మాస్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతోంది. పాట విడుదలైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సాధించింది.