Coolie: 'ఎ' సర్టిఫికెట్ వచ్చినా.. రూ. 1000 కోట్లు పక్కా
ABN , Publish Date - Aug 02 , 2025 | 04:12 PM
సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ కి ఊపిరి ఆడటం లేదు. బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ తో తెగ ఖుషి అవుతున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ కంటెంట్ తో డబుల్ ఖుషి చేసిన 'కూలీ' మేకర్స్... ఓ విషయంలో మాత్రం కాస్త టెన్షన్ పెడుతున్నారు.
స్టార్ హీరోస్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. ఇప్పుడు తలైవా తో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు బిగ్ స్టార్స్ కదలి రావడం సెన్సేషన్ గా మారింది. సూపర్ స్టార్ రజనీ కాంత్ (Rajinikanth), లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబోలో వస్తున్న 'కూలీ' (Coolie) కోసం యావత్ దేశం ఈగర్ గా వెయిట్ చేస్తోంది. మరి కొన్నిరోజుల్లో బాక్సాఫీస్ పై ఊచకోత ఎలా ఉండబోతుందో రుచి చూపించబోతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన సాంగ్స్ సినిమాకు కావాల్సినంత హైప్ ను క్రియేట్ చేయగా... మరికొన్ని గంటల్లో రిలీజ్ కానున్న ట్రైలర్ ఆ బజ్ ను డబుల్ చేయనుంది. అంత బాగానే ఉంది కానీ లేటెస్ట్ న్యూస్ ఒకటి... ఫ్యాన్స్ ను టెన్షన్ కు గురిచేస్తోంది. పైగా సూపర్ స్టార్ కెరీర్ లోనే అలా జరగడం ఫస్ట్ టైమ్ కావడంతో కాస్త కంగారు పడుతున్నారు.
'కూలీ' ఆగస్ట్ 14న గ్రాండ్ గా రిలీజ్ కానున్న తరుణంలో సెన్సార్ ను కంప్లీట్ చేసుకుంది. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు ఉహించని షాక్ ఇచ్చారు. మూవీకి 'ఎ' సర్టిఫికెట్ ను జారీ చేశారు. భారీ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు బ్లడ్ బాత్ ఎక్కువగా ఉండటంతో 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు మూడు గంటల నిడివి ఉన్న ఈ మూవీకి 18 సంవత్సరాల లోపు పిల్లలకు అనుమతిలేదని స్పష్టం చేసింది సి.బి.ఎఫ్.సి. ఇదిలా ఉంటే ఈ మూవీ ట్రైలర్ ఫ్రెండ్‌షిప్ డే కానుకగా శనివారం రాత్రి 7 గంటలకు విడుదల కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ నెక్ట్స్ లెవల్ లో ఉంది. పోస్టర్ లో నాగార్జున (Nagarjuna) సుత్తి పట్టుకుని రక్తంతో తడిచిన బట్టలతో కనిపించి అంచనాలు పెంచాడు. ఇదిలా ఉంటే 'కూలీ' మూవీకి 'ఎ' సరిఫ్టికెట్ రావడంపై డైరెక్టర్ లోకేష్ కనకగార్ తనదైన స్టైల్ లో స్పందించారు. స్టోరీలో భాగంగా వచ్చే వయొలెన్స్ సీన్లలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని.. పైగా ఎమోషన్స్ ఎలివేట్ అవ్వడానికి హింసనే కీలకంగా మారడంతో సెన్సార్ సభ్యులు అభ్యంతరాలు తెలిపినా తాను పట్టించుకోలేదన్నారు. అయితే రజనీకాంత్ కెరీర్ లో 'ఎ' సర్టిఫికెట్ వచ్చిన సినిమా 'కూలీ'నే కావడం విశేషం.
మరోవైపు 'కూలీ' సినిమా రూ. 1000 కోట్ల బొమ్మ అంటూ ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్ లో అదరగొడుతోంది మూవీ. అమెరికాలో ప్రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే రూ. 4.84 కోట్ల రూపాయలు దాటిందట. 800 షోస్ లో 20, 500 టికెట్లు అమ్ముడవడం సినిమాపై ఉన్న భారీ బజ్‌ను చూపిస్తోంది. అయితే ఆగస్టు 14, 2025న 'వార్ 2' కూడా విడుదల అవుతుండటంతో... బాక్సాఫీస్ బరిలో కాస్త టఫ్ ఫైట్ తప్పేలా లేదు. అయితే ఇండియాలో ఇంతవరకూ 'ఎ' సర్టిఫికెట్ వచ్చిన ఏ సినిమా కూడా రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరలేదు. ఆ రకంగా 'కూలీ' ఆ కేటగిరిలో మొదటి సినిమా అవుతుందేమో చూడాలి.