Rishabh Shetty: టాప్ 1 పొజిషన్ కు చేరువలో...
ABN , Publish Date - Oct 17 , 2025 | 02:44 PM
'ఛావా' రికార్డులను తిరగరాయడానికి రెడీ అవుతోంది 'కాంతార : చాప్టర్ 1' చిత్రం. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ. 800 కోట్ల గ్రాస్ ను వసూలు చేయడం ఖాయమంటున్నారు ట్రేడ్ పండిట్స్.
'కాంతార' (kantara) సినిమాతో జాతీయ ఉత్తమ నటుడుగా ఎంపికైన రిషభ్ శెట్టి (Rishabh Shetty) ఇప్పుడు దాని ప్రీక్వెల్ తోనూ మరోసారి తన సత్తాను చాటాడు. రాబోయే అవార్డుల సంగతి ఏమో కానీ ప్రస్తుతం కమర్షియల్ గా ఈ సినిమాను విజయపథంలోకి లోకి తీసుకెళ్ళాడు రిషభ్. అతనిలోని నటుడు, దర్శకుడు ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడి సై అంటే సై అనే రీతిలో ఈ సినిమాకు పని చేసిన భావన ప్రతి ప్రేక్షకుడికీ కలిగేలా చేశాడు.
తాజాగా 'కాంతార : చాప్టర్ 1' సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 717.50 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. తెలుగులో రెండు వారాలకు గానూ 105 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసింది. ఓ కన్నడ డబ్బింగ్ సినిమా వంద కోట్ల గ్రాస్ ను తెలుగులో వసూలు చేయడమనేది నిజంగా ఊహకందని విషయం. ఇప్పటికీ 'కాంతార' థియేటర్లలో సందడి చేస్తూనే ఉంది. అందుకనే ఈ యేడాది ఇంతవరకూ రూ. 800 కోట్ల గ్రాస్ ను సాధించి, అగ్రస్థానంలో ఉన్న 'ఛావా' (Chaawa) సినిమాను 'కాంతార : చాప్టర్ 1' అధిగమిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇంకా కేవలం రెండున్నర నెలలు మాత్రమే ఉండటం, ఈ సమయంలో చెప్పుకోదగ్గ పెద్ద చిత్రమేదీ లేకపోవడంతో ఈ యేడాది 'కాంతార: చాప్టర్ 1' టాప్ పొజిషన్ లో నిలుస్తుందని అంటున్నారు. మరి బాలకృష్ణ 'అఖండ -2' (Akhanda -2) సినిమా సైతం పాన్ ఇండియా స్థాయిలో బరిలోకి దిగుతోంది కాబట్టి... దాని ఫలితం ఎలా ఉంటుందో, ఎన్ని కోట్ల వసూలు చేస్తుందో చూడాలి.
Also Read: Telusu Kada : తెలుసు కదా మూవీ రివ్యూ
Also Read: Saamrajyam: నా స్టోరీని ఎన్టీఆర్‌తో.. చేపించండి కుమ్మేస్తాడు! అదిరిన శింబు సామ్రాజ్యం ప్రోమో