Kantara Chapter 1: అవన్నీ సినిమాకు సంబంధం లేనివి

ABN , Publish Date - Aug 13 , 2025 | 05:02 AM

కన్నడ చిత్రం ‘కాంతార’ పాన్‌ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. కేవలం రూ.15 కోట్లతో నిర్మిస్తే రూ.450 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీనికి సీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్‌ 1’ అనే...

కన్నడ చిత్రం ‘కాంతార’ పాన్‌ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. కేవలం రూ.15 కోట్లతో నిర్మిస్తే రూ.450 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీనికి సీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్‌ 1’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు రిషబ్‌ శెట్టి. అయితే ఈ చిత్రం షూటింగ్‌ మొదలైనప్పటి నుంచి వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏదైనా శాపం కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయేమో అంటూ కన్నడ ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత చలువే గౌడ క్లారిటీ ఇచ్చారు. సెట్‌లో ఒకే ఒక అగ్ని ప్రమాదం జరిగిందని, మిగతావన్నీ సినిమాకు సంబంధం లేనివేనని స్పష్టం చేశారు. ‘కాంతార: చాప్టర్‌ 1’ ప్రకటన చేసే ముందే మా టీమ్‌ అంతా పంజుర్లిని కలసి దేవుడి నిర్ణయం ఎలా ఉంటుంది? అని అడిగాం. ‘కొన్ని అవరోధాలు ఏర్పడతాయి. అయినా మీరు ఈ కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు అని చెప్పారు’ అని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Aug 13 , 2025 | 05:02 AM