Saamrajyam: నా స్టోరీని ఎన్టీఆర్‌తో.. చేపించండి కుమ్మేస్తాడు! అదిరిన శింబు సామ్రాజ్యం ప్రోమో

ABN , Publish Date - Oct 17 , 2025 | 01:00 PM

శింబు హీరోగా జాతీయ అవార్డు ద‌ర్శ‌కుడు, క్రియేటివ్ జీనియ‌స్ వెట్రిమార‌న్ తెర‌కెక్కిస్తున్న‌ చిత్రం అర‌స‌న్ (Arasan). తెలుగులో సామ్రాజ్యం పేరుతో రానుంది.

Saamrajyam

త‌మిళ అగ్ర హీరో శిలంబరసన్ టీఆర్ (Silambarasan) అలియాస్‌ శింబు హీరోగా జాతీయ అవార్డు ద‌ర్శ‌కుడు, క్రియేటివ్ జీనియ‌స్ వెట్రిమార‌న్ (Vetrimaaran) తెర‌కెక్కిస్తున్న‌ చిత్రం అర‌స‌న్ (Arasan). తెలుగులో సామ్రాజ్యం (Saamrajyam) పేరుతో రానుంది. తాజాగా ఈ చిత్రం ప్రోమోను యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (Jr NTR) ట్విట్ట‌ర్ ఎక్స్ ద్వారా శుక్ర‌వారం ఉద‌యం విడుద‌ల చేశారు. ఇంకా షూటింగ్ పూర్తిగా ప‌ట్టాలెక్క‌ని ఈ చిత్రం ఉత్తర చెన్నై నేపథ్యంలో గ్యాంగ్‌స్ట‌ర్ క‌థ‌తో రూపొందుతుండ‌గా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

తాజాగా విడుద‌ల చేసిన ప్రోమో 4 నిమిషాల‌కు పైగా ఉండ‌డ‌మే గాక‌ చూస్తే చాలా రా అండ్ ర‌స్టిక్ లాగా ఉంది. హాత్యా నేరం అభియోగంతో కోర్టుకు వ‌చ్చిన హీరో జ‌డ్జి ముందు నాకేమీ తెలియ‌దు న‌న్ను ఇరికించారు అని చెబుతూనే మ‌రో వైపు యంగ్ హీరో ముగ్గురిని న‌రికి చేతులు క‌డిగే స‌న్నివేశాల‌ను ప్ర‌జెంట్ చేశారు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. ప్రోమో ఆరంభఃలో జైల‌ర్ ద‌ర్శ‌కుడు నెల్స‌న్ దిలీప్‌కుమార్ ఎంట్రీ అత‌నితో హీరో మాట్లాడే డైలాగ్స్ అదిరిపోయాయి.

ముఖ్యంగా నా స్టోరీని ఎవ‌రితో చేపిద్దామ‌నుకుంటున్నారు.. ఎన్టీఆర్‌తో చేపించండి కుమ్మేస్తాడు అంటూ శింబ ఉచెప్పే డైలాగ్ ఆక‌ట్టుకునేలా ఉంది. గ‌తంలో వెట్రిమార‌న్‌, ధ‌నుష్ కాంబోలో వ‌చ్చిన వ‌డ చెన్నై సినిమాను యూనివ‌ర్స్‌గా మార్చి అందులో ఓ పార్ట్‌గా ఈ సినిమాను తీసుకు వ‌స్తున్నారు. ఇదిలాఉంటే ఈ చిత్రంలో స‌మంత‌, కీర్తి సురేశ్‌, సాయి ప‌ల్ల‌విలు ముగ్గురిలో ఇద్ద‌రు క‌థానాయిక‌లుగా చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Updated Date - Oct 17 , 2025 | 01:21 PM