Kaantha: టాప్ క్లాస్ ప్రొడక్షన్ గా 'కాంత': రానా
ABN, Publish Date - Nov 15 , 2025 | 01:15 PM
'కాంత' చిత్రానికి చెన్నయ్ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారని రానా తెలిపారు. ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్ కు మంచి స్పందన రావడం పట్ల హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే హర్షం వ్యక్తం చేసింది.
దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి నిర్మించిన రెట్రో మూవీ 'కాంత' (Kaantha). సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఇద్దరితో పాటు భాగ్యశ్రీ బోర్సే (Bhagyasri Borse), సముతిరకని (Samutirakani) కీలక పాత్రలు పోషించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా మద్రాసు నేపథ్యంలో రూపుదిద్దుకోవడంతో అక్కడి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారని రానా తెలిపారు. శుక్రవారం భాగ్యశ్రీ బోర్సేతో రానా (Rana) కలిసి మీడియాతో ముచ్చటించారు. 'కాంత సినిమాకి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్నిచ్చిందని, ముఖ్యంగా పెర్ఫార్మెన్స్ లకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిందని రానా చెప్పారు. ఆయన ఈ సినిమా గురించి ఇంకా మాట్లాడుతూ, 'దుల్కర్ గారి కెరీర్ ఫైనస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. మ్యూజిక్, విజువల్స్ టెక్నికల్ వాల్యూస్ గురించి చాలా మంచి ప్రశంసలు వస్తున్నాయి. టాప్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూ వున్నా సినిమా ఇది. జోనర్ బెండింగ్ సినిమా గా వచ్చిన ఫస్ట్ ఫిలిమ్ కాంత' అని అన్నారు.
ఈ సందర్భంగా భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ, 'కాంత మూవీలో అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా నూరు శాతం అవుట్ పుట్ ఇవ్వాలనే అనుకుంటాం. నాకిది తొలి తమిళ చిత్రం. దర్శకుడు సెల్వ సపోర్ట్ తో ప్రతి లైన్ గురించి క్షుణ్ణంగా తెలుసుకుని నా బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశాను. నా నటన ప్రేక్షకులకు నచ్చడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం ఆరు నెలల చెన్నయ్ లోనే ఉన్నాను' అని అన్నారు. తనకు చిన్నప్పటి నుండి పాత సినిమాలంటే ఇష్టమని, వాటిని చూడటం వల్ల ఈ సినిమాలో బాగా నటించే ఆస్కారం ఏర్పడిందని, పర్టిక్యులర్ గా ఈ సినిమా కోసం సావిత్రి, శ్రీదేవి నటించిన సినిమాలు ఎక్కువ చూశానని భాగ్యశ్రీ బోర్సే తెలిపింది. మరో వారంలో తన మరో చిత్రం 'ఆంధ్రా కింగ్ తాలూకా' రావడం ఆనందంగా ఉందని భాగ్యశ్రీ చెబుతూ, ఈ రెండు చిత్రాలు సినిమా నేపథ్యంలో తెరకెక్కినవే అయినా... కథ పరంగా భిన్నమైనవని తెలిపింది.
Also Read: Vishal vs Lyca: ఈ కేసుకు.. దారేది! విశాల్ - లైకా వివాదం.. విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి
Aso Read: Rajkummar Rao: బాలీవుడ్ స్టార్స్‌కు ప్రమోషన్.. తండ్రైన రాజ్‌కుమార్ రావ్