Kaantha: 'పసి మనసే'.. కెమిస్ట్రీ బాగా కుదిరినట్టుందిగా

ABN , Publish Date - Aug 08 , 2025 | 06:58 PM

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. గతేడాది లక్కీ భాస్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్న దుల్కర్.. ఇప్పుడు కాంత (Kaantha) అనే సినిమాతో రాబోతున్నాడు.

Kaantha

Kaantha: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. గతేడాది లక్కీ భాస్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్న దుల్కర్.. ఇప్పుడు కాంత (Kaantha) అనే సినిమాతో రాబోతున్నాడు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రానా దగ్గుబాటితో కలిస్ దుల్కర్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తుండగా.. సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


కాంత ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరఅపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. సినిమాలోని ఒక్కో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. కాంత నుంచి మొదటి సాంగ్ పసి మనసే రిలీజ్ కు మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. ఆగస్టు 9 సాయంత్రం 4.30 గంటలకు పసి మనసే ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలుపుతూ ఒక చిన్న ప్రోమోను రిలీజ్ చేశారు.


ఇక ఈ ప్రోమోలో దుల్కర్, భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ చాలా కొత్తగా కనిపిస్తుందిట. ఈ సినిమాలో వీరు హీరో హీరోయిన్లుగానే కనిపిస్తున్నారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండిందని ఈ చిన్న ప్రోమోలోనే తెలిసిపోతుంది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. 1950లో జరిగిన ఒక కథగా కాంత తెరకెక్కుతుంది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాపైనే భాగ్యశ్రీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే అమ్మడికి రెండు ప్లాపులు వచ్చాయి. ఈ సినిమా అయినా అమ్మడిని ఆదుకుంటుందేమో చూడాలి.

Naga Shaurya: 'బ్యాడ్ బాయ్ కార్తీక్' నుండి ఫస్ట్ సింగిల్

Pellilo Pelli : పెళ్లిలో పెళ్లి ఫస్ట్ లుక్ లాంచ్

Updated Date - Aug 08 , 2025 | 06:58 PM