Vishal vs Lyca: ఈ కేసుకు.. దారేది! విశాల్ - లైకా వివాదం.. విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:26 PM
హీరో విశాల్ (Vishal), లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) మధ్య సాగుతున్న రుణ వివాదానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
హీరో విశాల్ (Vishal), లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) మధ్య సాగుతున్న రుణ వివాదానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ నుంచి మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జయచంద్రన్ (Justice Jayachandran)స్వయంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
వివరాల్లోకి వెళితే.. లైకా ప్రొడక్షన్స్‌కు విశాల్ మొత్తం రూ.21.30 కోట్ల రుణం చెల్లించాల్సి ఉంది. ఈ కేసు గత కొన్ని నెలలుగా మద్రాస్ హైకోర్టులో విచారణలో ఉంది. ఇటీవల న్యాయమూర్తులు జయచంద్రన్–ముమ్మినేని ధర్మాసనం ఈ రుణాన్ని 30% వడ్డీతో కలిపి చెల్లించాలని తీర్పు ఇచ్చింది. దీనిపై విశాల్ అప్పీల్ చేయడంతో, న్యాయమూర్తి జయచంద్రన్ ఈ కేసుపై విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు.
ఈ కేసుపై విచారణ ఇప్పటికే పూర్తయిందని, కొన్ని అభిప్రాయాలను వ్యక్తపరిచిన నేపథ్యంలో విచారణ కొనసాగించడం సరిగా ఉండదని భావించి న్యాయమూర్తి జయచంద్రన్ విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో కేసును మరొక ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు.