Rajkummar Rao: బాలీవుడ్ స్టార్స్‌కు ప్రమోషన్.. తండ్రైన రాజ్‌కుమార్ రావ్
ABN , Publish Date - Nov 15 , 2025 | 11:45 AM
బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావ్ (Rajkummar Rao) ఇంట కొత్త పండుగ వాతావరణం నెలకొంది. రాజ్‌కుమార్ రావ్ తండ్రిగా ప్రమోషన్ పొందారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావ్ (Rajkummar Rao) ఇంట కొత్త పండుగ వాతావరణం నెలకొంది. రాజ్‌కుమార్ రావ్ తండ్రిగా ప్రమోషన్ పొందారు. ఆయన భార్య, నటి పత్రలేఖ (Patralekha) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటన రిలీజ్ చేసి విషయం వెళ్లడించాడు. ఈ
రాజ్‌కుమార్–పత్రలేఖ దాదాపు పదేళ్ల ప్రేమ తర్వాత 2021లో వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. వారి వ్యక్తిగత జీవితం ఎప్పుడూ సింపుల్‌గా, ప్రశాంతంగా కొనసాగుతుండగా.. ఈ చిన్నారి రాకతో వారి కుటుంబంలో మరింత ఆనందం వెల్లివిరిసింది. ప్రస్తుతం పత్రలేఖ, శిశువు ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తెలిపారు.

ఇదిలాఉంటే.. రాజ్‌కుమార్ రావ్ రెండు నెలల క్రితం మాలిక్ అనే సినిమాతో అలరించగా చేతిలో ఐదారు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ శుభవార్త బయటకొచ్చిన వెంటనే సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.