Chiyaan Vikram: నూతన దర్శకుడితో విక్రమ్‌ 63

ABN , Publish Date - Nov 01 , 2025 | 04:25 PM

హీరో చియాన్‌ విక్రమ్‌ (Chiyan Vikram)మరో కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చారు. ఇప్పటివరకు కేవలం మూడు లఘు చిత్రాలను మాత్రమే రూపొందించిన బోడి కె.రాజ్‌కుమార్‌ దర్శకత్వంలో నటించేందుకు చియాన్‌ అంగీకరించారు.

హీరో చియాన్‌ విక్రమ్‌ (Chiyan Vikram)మరో కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చారు. ఇప్పటివరకు కేవలం మూడు లఘు చిత్రాలను మాత్రమే రూపొందించిన బోడి కె.రాజ్‌కుమార్‌ దర్శకత్వంలో నటించేందుకు చియాన్‌ అంగీకరించారు. నిరంతరం కొత్తదనం కోసం పరితపించే ఆయన తన 63వ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను డెబ్యూ డైరెక్టర్‌కు అప్పగించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాజెక్టును శాంతి టాకీస్‌ నిర్మించనుంది.

ALSO READ: DPFF - 2025: 'కల్కి'కి పురస్కారం.. ఉత్తమ నటి కృతిసనన్  

విక్రమ్‌ చివరగా ‘వీర ధీర శూరన్‌’ చిత్రంలో నటించారు. 63 చిత్రాన్ని ‘మండేలా’ ఫేం మడోన్‌ అశ్విన్‌ ప్రారంభించారు. కొద్ది రోజులపాటు చిత్రీకరణ కూడా జరిగినట్టు కోలీవుడ్‌ వరాల సమాచారం. చివరకు ఏమైందో గానీ ఈ ప్రాజెక్టు అర్థాంతరంగా నిలిచిపోయింది. ఇపుడు ఈ ప్రాజెక్టు తిరిగి పట్టాలెక్కనుంది. బోడి కె.రాజ్‌కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు.

ALSO READ: Lokah Chapter 1: థియేటర్ లో సూపర్ హిట్ అన్నారు.. ఓటీటీకి వచ్చాకా ఏంటి ఇలా

The Girlfriend: సమంతను అనుకోలేదు... రశ్మికే ఫస్ట్ ఛాయిస్...

Peddi-Janhvi Kapoor: ఫియర్‌లెస్‌.. మాస్ లుక్ అదిరింది.

Rashmika And Vijay: రీల్‌ లవ్‌ కాదు.. రియల్‌ లవ్‌ వేదికపైకి రాబోతుంది..



Updated Date - Nov 01 , 2025 | 10:45 PM