DPFF - 2025: 'కల్కి'కి పురస్కారం.. ఉత్తమ నటి కృతిసనన్
ABN , Publish Date - Nov 01 , 2025 | 04:14 PM
‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (డీపీఐఎఫ్‌ఎప్)- 2025’ అత్యంత వైభవంగా జరిగింది.
‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (Dadasaheb Phalke Film Festival) - 2025’ అత్యంత వైభవంగా జరిగింది. ముంబైలో జరిగిన ఈ వేడుకలో ఉత్తమ నటుడిగా కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan), ఉత్తమ నటిగా కృతిసనన్ లకు అవార్డులు వరించాయి. తెలుగు ఇండస్ట్రీ నుంచి ‘కల్కి 2898 ఏడీ’(Kalki 2898 AD) ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. ‘స్త్రీ 2’ (Stree 2) ఉత్తమ చిత్రంగా నిలిచింది. 2024లో సినిమాలతోపాటు వెబ్‌సిరీస్‌ల్లోనూ ప్రతిభ చాటిన వారికి కూడా ఈ పురస్కారాలు దక్కాయి
విజేతల వివరాలు..
ఉత్తమ దర్శకుడు : కబీర్‌ఖాన్ (Kabir khan)
ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్: దినేశ్ విజన్
క్రిటిక్స్ ఛాయిస్ బెస్ట్ ఫిల్మ్: లాపతా లేడీస్
క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్: విక్రాంత్ మస్సే
క్రిటిక్స్ బెస్ట్ యాక్ట్రెస్: నితాన్షీ గోయెల్
ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్: ఏఆర్ రెహమాన్
ఎక్స్‌లెన్స్ ఇన్ ఇండియన్ సినిమా: శిల్పాశెట్టి
అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ: జీనత్ అమన్
అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఇన్ మ్యూజిక్ ఇండస్ట్రీ: ఉషా ఉతుప్
బెస్ట్ వెబ్‌సిరీస్: హీరామండి
బెస్ట్ యాక్టర్ (వెబ్‌సిరీస్): జితేంద్ర కుమార్
బెస్ట్ యాక్ట్రెస్ (వెబ్‌సిరీస్): హ్యుమా ఖురేషి