Lokah Chapter 1: థియేటర్ లో సూపర్ హిట్ అన్నారు.. ఓటీటీకి వచ్చాకా ఏంటి ఇలా
ABN , Publish Date - Nov 01 , 2025 | 04:22 PM
ఈ ఏడాది సూపర్ హిట్ అయిన సినిమాల్లో లోక చాప్టర్ 1 - చంద్ర కూడా ఒకటి. కళ్యాణి ప్రియదర్శన్, నస్లేన్ జంటగా డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దుల్కర్ సల్మాన్ నిర్మించాడు.
Lokah Chapter 1: అసలు ప్రేక్షకులకు ఏ సినిమా నచ్చుతుంది.. ఎప్పుడు నచ్చుతుంది అని చెప్పడం చాలా కష్టంగా మారింది. కొన్నిసార్లు థియేటర్ లో నచ్చలేదు అన్న సినిమాను ఓటీటీలో సూపర్.. బంపర్ అని చెప్పుకొస్తారు. ఇంకొన్నిసార్లు థియేటర్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాను ఓటీటీలోకి రాగానే ఏం సినిమా ఇది అని పెదవి విరుస్తున్నారు. తాజాగా ఓటీటీలో రిలీజ్ అయిన హిట్ సినిమా లోక పరిస్థితి ఇలాగే ఉంది.
ఈ ఏడాది సూపర్ హిట్ అయిన సినిమాల్లో లోక చాప్టర్ 1 - చంద్ర కూడా ఒకటి. కళ్యాణి ప్రియదర్శన్, నస్లేన్ జంటగా డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దుల్కర్ సల్మాన్ నిర్మించాడు. మొట్ట మొదటి లేడీ సూపర్ హీరో గా కళ్యాణి దర్శనమిచ్చింది. ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ 4 న రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.
మళయాళంలోనే కాకుండా తెలుగులో కూడా కొత్త లోక పేరుతో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపు 300 కోట్లకు పైగా వసూళ్లు చేసి షాక్ ఇచ్చింది. ఎంత పెద్ద హిట్ సినిమా అయినా నాలుగు వారాల్లో ఓటీటీలో ఉండేది. కానీ, లోక మాత్రం నెల తరువాత ఇప్పుడే ఓటీటీ బాట పట్టింది. ఈ శుక్రవారం నుంచి లోక జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇక థియేటర్ లో ఆ రేంజ్ లో రచ్చ చేసింది అంటే ఓటీటీలో కూడా అలాంటి రిజల్ట్ నే వస్తుంది అనుకున్నారు. కానీ దానికి రివర్స్ గా ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. లోక ఓటీటీలో మిక్స్డ్ టాక్ అందుకుంటుంది. ఏముంది ఇందులో.. ఎందుకు దీనికి ఇంత హైప్ ఇచ్చారు అంటూ చెప్పుకొస్తున్నారు. థియేటర్ లో అంత హైప్ ఇచ్చారు.. సినిమాలో కథేమీ లేదు. ఎలా నచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నెగిటివ్ టాక్ కొత్త లోకకు కొత్త తలనొప్పిని తీసుకొచ్చి పెడుతుంది. ఈ టాక్ కచ్చితంగా డేంజర్ అనే చెప్పాలి. మరి దీనిని మేకర్స్ ఏమైనా సరిదిద్దుతారా లేదా అనేది చూడాలి.
DPFF - 2025: 'కల్కి'కి పురస్కారం.. ఉత్తమ నటి కృతిసనన్
The Girlfriend: సమంతను అనుకోలేదు... రశ్మికే ఫస్ట్ ఛాయిస్...