Rashmika And Vijay: రీల్ లవ్ కాదు.. రియల్ లవ్ వేదికపైకి రాబోతుంది..
ABN , Publish Date - Nov 01 , 2025 | 02:45 PM
దాదాపు ఐదారేళ్లగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రేమలో ఉన్నారనే వార్త వైరల్ అవుతూనే ఉంది. పెళ్లి కూడా ఖాయమనే వార్తలు వచ్చాయి. దీనిపై ఇద్దరూ ఏమీ స్పందించలేదు.
దాదాపు ఐదారేళ్లగా విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక మందన్నా (Rashmika Mandanna) ప్రేమలో ఉన్నారనే వార్త వైరల్ అవుతూనే ఉంది. పెళ్లి కూడా ఖాయమనే వార్తలు వచ్చాయి. దీనిపై ఇద్దరూ ఏమీ స్పందించలేదు. తాజాగా ఇద్దరికి నిశ్చితార్థం అయిందనే వార్తలు వచ్చాయి. కానీ అఫీషియల్ ఎక్కడా చెప్పలేదు. ఇద్దరూ రింగులతో కూడా కనిపించారు. ప్రస్తుతం రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girl friend) సినిమా ప్రమోషన్‌తో బిజీగా ఉన్నారు. నవంబర్ 7న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ స్పెషల్ గెస్ట్‌గా హాజరుకానున్నట్లు తెలిసింది. అయితే నిశ్చితార్థం తర్వాత మొదటిసారి ఈ జంట ఒకే స్టేజ్‌పైౖ కనిపించబోతున్నారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సోషల్ మీడియాలో వీరిద్దరికీ ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఇద్దరిని లింక్ చేస్తూ వచ్చే వార్త ఏదైనా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ‘గీతా గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అద్భుతంగా పండింది. ఈ రెండు చిత్రాల నుంచి ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం కొనసాగుతుంది. ఇద్దరూ కలిసి టూర్లు వెళ్లడం, వేర్వేరుగా ఫొటోలు పోస్ట్ చేయడం, ఆ ఫొటోలను నెటిజన్లు గుర్తు పట్టడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందనే వార్త బలంగానే వినిపిస్తుండేది. రష్మిక బాలీవుడ్ వైపు వెళ్లినా విజయ్‌తో తన బాండింగ్ తగ్గలేదని ఎప్పటికప్పుడు హింట్ ఇస్తూనే ఉంటుంది. నిశ్చితార్థం జరిగిన తర్వాత కూడా పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే ఇద్దరూ తప్పించుకుంటున్నారు.
అయితే ఈ జంట కలిసి ఒకే స్టేజ్‌పై కనిపిస్తే మీడియా ఫోకస్ అంతా వారిపైనే నిలవడం ఖాయం. ఇప్పుడైనా ప్రేమ, నిశ్చితార్థంపై స్పందిస్తారా? ఫ్యాన్స్ కోసం ఫోటోలకు పోజులిచ్చి వదిలేస్తారా? అన్నది ఇప్పుడు టాపిక్. రష్మిక, విజయ్ ఇద్దరూ ఈ విషయంలో ఇప్పటివరకు ఎటువంటి వ్యాఖ్య చేయకపోయినా, అభిమానులు మాత్రం ‘వీరి పెళ్లి తేదీ త్వరలోనే బయటకు వస్తుంది’ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ‘ఇది రీల్ లవ్ కాదు, రియల్ లవ్ స్టేజ్‌పైకి వస్తుంది’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే వీరిద్దరి సన్నిహితులు ‘త్వరలో మంచి వార్త రాబోతోంది’ అని చెబుతున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. -ఈ చిత్రం నిరుత్సాహ పరచింది. తాజాగా ‘రౌడీ జనార్దన్’ సినిమా షురూ చేశారు. కీర్తి సురేష్ హీరోయిన్.