Peddi-Janhvi Kapoor: ఫియర్‌లెస్.. మాస్ లుక్ అదిరింది.
ABN , Publish Date - Nov 01 , 2025 | 03:56 PM
రామ్‌చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మొదటి పాటను త్వరలో విడుదల చేయనున్నారు. అయితే తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ లుక్‌ను విడుదల చేశారు.
రామ్‌చరణ్ (Ram Charan), జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘పెద్ది’ (Peddi). బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మొదటి పాటను త్వరలో విడుదల చేయనున్నారు. అయితే తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో జాన్వీకపూర్ అచ్చియమ్మగా కనిపించనుంది. ఫైర్స్ అండ్ ఫియర్‌లెస్ అంటూ రెండు పోస్టర్‌లను విడుదల చేశారు. (Janhvi Kapoor as Achiyyamma)
మొదటి పోస్టర్‌లో జాన్వీ కపూర్ గ్రామీణ అమ్మాయిగా సంప్రదాయ దుస్తులు, ఆభరణాలతో కళ్లజోడు ధరించి జీప్‌పై నిలబడి జనసమూహానికి ఆత్మవిశ్వాసంతో అభివాదం చేస్తూ కనిపిస్తున్నారు. మరో పోస్టర్‌లో మైక్ ముందు నిలబడి ఉన్నారు. మొదటి పోస్టర్ చూస్తుంటే గ్రామంలో జరిగే వేడుకలా అనిపిస్తోంది. రెండవ పోస్టర్‌లో ఆమె లుక్ చూస్తే ఆమె ధైర్య సాహసాలు, స్వభావం బలంగా కనిపిస్తున్నాయి. ఈ రెండు పోస్టర్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రతిషాత్మకంగా సమర్పిస్తున్నాయి. శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ. ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది.