చిత్రంగా ఓటీటీలోకి

ABN , Publish Date - Jun 02 , 2025 | 01:33 PM

గ‌త నెలలో చిన్న చిత్రంగా ఓటీటీలోకి వ‌చ్చిన‌ చిత్రం టుక్ టుక్ పెద్ద సంచ‌ల‌న‌మే సృష్టిస్తోంది.

tuk tuk

మార్చి నెలలో చిన్న చిత్రంగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి ఆక‌ట్టుకున్న చిత్రం టుక్ టుక్ (Tuk Tuk Movie). హర్ష రోషన్ (Harsh Roshan), కార్తికేయ దేవ్ (Karthikeyaa Dev), స్టీవెన్ మధు, సాన్వీ మేఘన (Saanve Megghana), నిహాల్ కోధాటి ముఖ్య పాత్ర‌ల్లో రూపొందిన‌ ఈ చిత్రానికి సి.సుప్రీత్‌ కృష్ణ (Supreeth C Krishna) దర్శకుడు. చిత్రవాహిని మరియు ఆర్ వై జి సినిమాస్‌ పతాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డి, సుప్రీత్ సి కృష్ణ నిర్మించారు.

ముగ్గురు టీనేజ్ కుర్రాళ్లు, ఓ స్కూట‌ర్ చుట్టు న‌డిచే క‌థ‌తో వ‌చ్చిన ఈ మూవీ గ‌త నెల‌లో డిటిజ‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చి ఇప్ప‌టికీ సంచ‌ల‌న వ్యూస్‌తో దూసుకు పోతుంది. మొద‌ట‌గా ఈ టీవీ విన్‌లో స్ట్రీమింగ్‌కు వ‌చ్చిన ఈ చిత్రం రెండు వారాల త‌ర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి సైతం వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అల‌రిస్తోంది. ముఖ్యంగా అమోజాన్ (Amazon prime video) ఓటీటీ (Ott) లో జాతీయ స్థాయిలో టాప్ 3లో ట్రెండింగ్‌లో నిలిచి అంద‌రినీ అశ్య‌ర్య ప‌రిచింది. ఇప్ప‌టి వ‌ర‌కు 100 మిలియ‌న్ వ్యూస్‌ సాధించి చిన్న సినిమా పెద్ద రికార్డు సృష్టించింది.

GsNUhDTXwAAQ3eo.jpg

ఈ సంద‌ర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ థియేటర్‌తో పాటు మా సినిమాకు ఓటీటీలో కూడా మంచి ఆదరణ లభించడం ఆనందంగా ఉందని, సినిమాలో ఫాంటసీ, ఎమోషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్కూటర్‌ మ్యాజిక్‌ పవర్స్‌ పిల్లలతో పాటు పెద్దలను కూడా అల‌రిస్తున్నాయన్నారు. ముఖ్యంగా ఎలాంటి పెద్ద క్యాస్టింగ్ లేకుండా, మంచి గుర్తింపు ఉన్న న‌టులు కూడా లేకుండా ఈ సినిమా రూపొంద‌డం ఓ విశేషం. లో బ‌డ్జెట్‌లో కేవ‌లం ముగ్గురు కుర్రాళ్ల చుట్టూనే క‌థ‌ తిరుగుతూ ప్రేక్షకులను సినిమాలో లీన‌మయ్యేలా చేయ‌డంలో ద‌ర్శ‌కుడు, సంగీతం మంచి పాత్ర పోషించాయి. ఈ సినిమాకు ఓటీటీలో ద‌క్కిన విజ‌యం భ‌విష్య‌త్తులో మ‌రిన్ని చిన్న సినిమాల‌కు బాట‌లు వేసింది.

క‌థ విష‌యానికి వ‌స్తే.. యుక్త వయసులో ఉన్న ముగ్గురు కుర్రాళ్ళు డబ్బు కోసం వినాయకుడి విగ్రహం పెట్టి వినాయక చవితి పండుగ చేస్తారు. ఆ ఊర్లో అంత‌కుముందు జ‌రిగిన‌ గొడవల వల్ల వారి వినాయకుడి నిమజ్జనానికి వాహనం దొరకదు. దాంతో ఈ ముగ్గురు కలిసి ఓ షెడ్‌ నుంచి పాడు పడ్డ ఓ చేతక్‌ స్కూటర్‌కు మరమత్తులు చేయించి లైన్‌లోకి తీసుకొస్తారు. దానికి టుక్‌ టుక్‌ అని పేరు పెట్టి దానిపైనే నిమజ్జనం పూర్తి చేస్తారు. ఆ తర్వాతే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. ఉన్న‌ట్టుండి ఆ స్కూటర్‌ కొన్ని విన్యాసాలు చేస్తుంది. ఏ ప్రశ్న అడిగినా సమాధానంగా హ్యాండిల్‌ అటు.. ఇటు తిప్పడం, లైట్ వెలిగిస్తూ సమాధానం ఇస్తుంది. ఇంతకీ ఆ స్కూటర్‌లో ఉన్నది ఏంటి? శిల్ప (శాన్వీ మేఘన)కు ఆ స్కూటర్‌కి సంబంధం ఏంటి? అన్నది ఈ టుక్ టుక్ (Tuk Tuk Movie) సినిమా కథ.


ఇవి కూడా చ‌ద‌వండి..

ఒరేయ్ అలీగా.. బూతుల‌తో మ‌ళ్లీ నోరుపారేసుకున్న రాజేంద్ర ప్ర‌సాద్

తెలుగులోను ఓటీటీకి వ‌చ్చేసిన టూరిస్ట్ ఫ్యామిలీ.. అస‌లు వ‌ద‌ల‌కండి!

ఓటీటీకి.. స‌మంత నిర్మించిన హ‌ర్ర‌ర్, కామెడీ! ఎక్క‌డ చూడాలంటే!

ర‌జ‌నీకాంత్‌కు నిద్ర క‌రువు చేసిన సినిమా.. ఎట్ట‌కేల‌కు ఓటీటీకి లాల్‌ స‌లామ్!

శివ కార్తికేయ‌న్, శ్రీలీల ప‌రాశ‌క్తి.. విల‌న్‌గా జ‌యం రవి

Updated Date - Jun 03 , 2025 | 10:39 AM