సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Oho Enthan Baby OTT: అదిరిపోయే రొమాంటిక్ ల‌వ్‌స్టోరి.. తెలుగులోనూ ఓటీటీకి వ‌చ్చేసింది

ABN, Publish Date - Aug 08 , 2025 | 07:02 AM

త‌మిళ న‌టుడు విష్ణు విశాల్ సోద‌రుడు రుద్రను క‌థానాయ‌కుడిగా ఆరంగేట్రం చేయిస్తూ స్వ‌యంగా నిర్మించిన‌ చిత్రం ఓహో ఎంత‌న్ బేబీ.

Oho Enthan Baby

తెలుగ‌మ్మాయి గుత్తా జ్వాల భర్త‌, త‌మిళ న‌టుడు విష్ణు విశాల్ (Vishnu Vishal) సోద‌రుడు రుద్ర (Rudra)ను క‌థానాయ‌కుడిగా అరంగేట్రం చేయిస్తూ స్వ‌యంగా నిర్మించిన‌ చిత్రం ఓహో ఎంత‌న్ బేబీ (Oho Enthan Baby). ఇందులో ఆయ‌న ఓ క్యారెక్ట‌ర్ సైతం చేయ‌డం విశేషం. కృష్ణ‌కుమార్ రామ్ కుమార్ (Krishnakumar Ramakumar) దర్శ‌క‌త్వం వ‌హించిన ఈ రొమాంటిక్ డ్రామా చిత్రం గ‌త నెల జూలై 11న‌ థియేట‌ర్లలోకి వ‌చ్చి ఫ‌ర్వాలేద‌ని అనిపించుకుంది. విశ్వ‌క్ సేన్ ఓ మై బేబీ ఫేమ్ మిథిలా పాల్క‌ర్ (Mithila Palkar), అంజు కురియ‌న్ (Anju Kurian), వైభ‌వి తాండ్లే (Vaibhavi Tandle) డైరెక్ట‌ర్ మిస్కిన్ (Mysskin), క‌స్తూరి, రెండ్ కింగ్ స్లే కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సినిమాలు, ద‌ర్శ‌కుడు, ల‌వ్ స్టోరీల చుట్టూ తిరిగే ఈ చిత్రం ఇప్పుడు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

క‌థ విష‌యానికి వ‌స్తే.. సినిమాలంటే పిచ్చి ఉన్న అశ్విన్‌కు ఎప్ప‌టికైనా ద‌ర్శ‌కుడిగా అవాల‌నే కోరిక బ‌లంగా ఉంటుంది. స‌రిగ్గా అదే స‌మ‌యంలో హీరో విష్ణు విశాల్‌కు ఇంత‌వ‌ర‌కు త‌ను చేయ‌ని, ఎవ‌రు చెప్ప‌ని క‌థ ల‌భిస్తే మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తాడ‌ని తెలుసుకున్న అశ్విన్ అప్ప‌టికే తాను రెండు మూడు సార్లు ల‌వ్ ఫెయిల్ అయి కావ‌డంతో త‌న స్టోరిల‌నే క‌థ‌గా చెబుతాడు. ఈ నేప‌థ్ యంలో క‌థ విన్న విశాల్ ఏం చేశాడు, సినిమా తీశాడా లేదా, అస‌లు అశ్విన్ చెప్పిన ల‌వ్ స్టోరీలు ఎలా ఉన్నాయి, ఎందుకు అన్ని సార్లు బ్రేక‌ప్ అయింది, చివ‌ర‌కు అశ్విన్ ప్రేమ వ్య‌వ‌హారం ఏమైంద‌నే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతుంది.

క‌థ‌గా చూస్తే ఇది రోటీన్ సినిమానే అనిపించిన స్క్రీన్ ప్లే, మూవీ సాగిన విధానం అంతా యూత్‌కు ఫుల్ క‌నెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఫ‌స్టాప్ కాస్త స్లోగా సాగిన సెకండాఫ్ ఇంట్రెస్ట్రింగ్‌గా ఉంటుంది. ప‌లు సంద‌ర్భాల్లో ముద్దులు, అడ‌ల్ట్ స‌న్నివేశాల‌తో కుర్ర‌కారుకు మ‌స్త్ కిక్ ఇస్తారు. ఇప్పుడీ చిత్రం ఆగ‌స్టు 8 శుక్ర‌వారం నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో మాతృక త‌మిళంతో పాటు తెలుగు ఇత‌ర భాష‌ల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. మంచి ల‌వ్ స్టోరి చూడాల‌నుకునే వారికి ఈ ఓహో ఎంత‌న్ బేబీ (Oho Enthan Baby) సినిమా బెస్ట్ ఆప్స‌న్‌. పిల్ల‌ల‌ను దూరంగా ఉంచ‌డం మంచిది.


Also Read... ఇవి కూడా చ‌ద‌వండి

Nadikar OTT: ఏడాది త‌ర్వాత ఓటీటీకి.. మ‌ల‌యాళ స్టార్ సినిమా! తెలుగులోనూ

Mahavatar Narsimha: ఓం న‌మో భ‌గ‌వ‌తే వాసుదేవాయ పాటొచ్చేసింది.. ఇక భ‌క్తి త‌న్మ‌య‌త్వంలో మునిగి తేలండి

Kingdom:‘కింగ్డమ్‌’.. థియేట‌ర్ల‌కు ర‌క్ష‌ణ కల్పించండి! హైకోర్టులో పిటిషన్

Theater Movies: ఈ శుక్ర‌వారం.. ఇండియా వైడ్ థియేట‌ర్ల‌కు వ‌స్తున్న సినిమాలివే! స‌గం హ‌ర్ర‌ర్ మూవీసే

Nandamuri Balakrishna: 'అఖండ-2' డబ్బింగ్ పూర్తి

Updated Date - Aug 08 , 2025 | 08:36 AM