Mahavatar Narsimha: ఓం నమో భగవతే వాసుదేవాయ పాటొచ్చేసింది.. ఇక భక్తి తన్మయత్వంలో మునిగి తేలండి
ABN , Publish Date - Aug 07 , 2025 | 11:01 PM
రెండు వారాల క్రితం థియేటర్లకు వచ్చి సంచలనం సృష్టిస్తోన్న చిత్రం మహావతార్ నరసింహ నుంచి ప్రధానమైన పాట రిలీజ్ అయింది.
కేజీఎఫ్ (KGF), కాంతారా (Kantara), సలార్ (Salaar) వంటి భారీ హిట్. చిత్రాలను నిర్మించిన హోంబలే సంస్థ (Hombale Films), క్లీమ్ ప్రొడక్షన్స్ (Kleem Productions)తో కలిసి తెరకెక్కించిన యానిమేషన్ చిత్రం మహావతార్ నరసింహ (Mahavatar Narsimha). మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలై రెండు వారాలు పూర్తి చేసుకున్నా ఇంకా అదిరిపోయే కలెక్షన్లు రాబడుతూ సంచలనం సృష్టిస్తుంది. వీరమల్లు, కింగ్డమ్ చిత్రాలను వెనక్కు నెట్టి మరి రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లతో అగ్రభాగాన దూసుకు వెళుతుంది.
అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఎంతో పాపులర్ అయిన, చాలా మంది తన్మయత్వానికి లోనయ్యేలా చేసిన, చేస్తున్న ఓం నమో భగవతే వాసుదేవాయ (Om Namo Bhagavate Vasudevaya) పాటను మేకర్స్ గురువారం రాత్రి రిలీజ్ చేశారు. పుష్ప2 సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్ అందించిన శ్యామ్ సీఎస్ (Sam CS) ఈ సినిమాకు సంగీతం అందించగా సౌరభ్ మిట్టల్ (Saurabh Mittal), ట్వింకిల్ మిట్టల్ (Twinkle Mittal), రాకేందు మౌళి (Rakendu Mouli) సాహిత్యం అందించారు. విజయ్ ప్రకాశ్ (Vijay Prakash )ఆలపించాడు. మీరు ఈ పాట కోసమే ఎదురు చూస్తూ ఉంటే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే వినడం ప్రారంభించి భక్తి లోకంలో విహరించండి.