Nadikar OTT: ఏడాది తర్వాత ఓటీటీకి.. మలయాళ స్టార్ సినిమా! తెలుగులోనూ
ABN , Publish Date - Aug 08 , 2025 | 08:24 AM
తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మలయాళ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ నిర్మించిన చిత్రం నడిగర్.
తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) మలయాళ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ నిర్మించిన చిత్రం నడిగర్ (Nadikar). టాప్ స్టార్ టొవినో థామస్ (Tovino Thomas) హీరోగా నటించిన ఈ సినిమా గత సంవత్సరం మే 3న థియేటర్లలో విడుదలై ఘోర పరాజయం చవిచూసింది. లాల్ జూనియర్ (Lal Jr) దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సువిన్ సోమశేఖరన్ (S. Somasekharan) రచన చేశారు. దివ్యా పిళ్లై (Divya Pillai), బాలు వర్గీస్, షౌబిన్ షాహిర్ (Soubin Shahir), షౌన్ టామ్ చాకో, ఇంద్రాన్స్, అనూప్ మీనన్, భావన వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. సుమారు రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం రూ. 5.30 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఏడాది తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
కథ విషయానికి వస్తే.. 2 గంటల 20 నిమిషాల నిడివితో పూర్తి కామెడీ డ్రామాగా నడిచే సినిమా ఇది. నడిగర్ అంటే నటుడు అని అర్థం. డేవిడ్ పడిక్కల్ అనే నటుడు నటించిన ఐదారు సినిమాలు వరుసగా బ్లాక్‌బస్టర్ కావడంతో సూపర్ స్టార్‌గా స్టేటస్ దక్కించుకుంటాడు. ఆపై తన ప్రవర్తన, ఇతరత్ర కారణాలతో సినిమాలు ఫ్లాప్ కావడంతో అతనికి వచ్చిన స్టార్ స్టేటస్ మసకబారుతుంది. సినిమా అవకాశాలు పోతాయి. ఈ నేపథ్యంలో తన నటనను మెరుగు పరుచుకునేందుకు బాలా అనే ట్రైనర్‌ను అప్రోచ్ అవుతాడు... ఆపై అతనితోనూ డేవిడ్ కు సమస్యలు వస్తాయి. ఈ క్రమంలో మరి డేవిడ్... బాలాతో కలిసి తన నటనను మెరుగు పరుచుకున్నాడా లేదా బిహేవియర్ అలానే ఉందా, తిరిగి సినిమా ఛాన్సులు దక్కించుకుని స్టార్ అయ్యాడా లేదా అనే పాయింట్‌తో కామెడీ జానర్‌లో సినిమా సాగుతుంది.
అయితే కథగా చెప్పుకోవడానికి బాగానే ఉన్నా ఎక్కువగా ఎలాంటి థ్రిల్ , ఎమోషన్ ఇచ్చే సన్నివేశాలు లేకుండా పూర్తిగా ప్లాట్ స్క్రీన్‌ప్లేతో సాగుతూ బోర్ కొట్టిస్తుంది. ఇప్పుడీ సినిమా మనం రెగ్యులర్ సినిమాలు చూసే అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, ఆహా, ఈటీవీ లాంటి ఓటీటీల్లో కాకుండా సైనా ప్లే అనే ఓటీటీ ప్లాట్‌ఫాంలో మలయాళంతో పాటు తెలుగు, ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. అంతేగాక ఇంకా కొన్ని థర్డ్ పార్టీ యప్స్, ఫ్రీ వెబ్‌సైట్లలోనూ ఈ చిత్రం అందుబాటులో ఉంది. మూవీలో ఎక్కడా అసభ్యత, అశ్లీలత లేనప్పటికీ పెద్ద స్టార్లు ఉన్నారని తప్పితే ఎంతో ఓపిక ఉంటే మాత్రమే ఈ నడిగర్ (Nadikar) సినిమాను చూడగలం.