Nandamuri Balakrishna: 'అఖండ-2' డబ్బింగ్ పూర్తి

ABN , Publish Date - Aug 07 , 2025 | 07:41 PM

నందమూరి బాలకృష్ణ 'అఖండ -2' దసరా బరిలోనే దిగబోతోందని తెలుస్తోంది. గురువారంతో డబ్బింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇతర కార్యకలాపాలను శరవేగంగా జరుపుకుంటోంది.

Akhanda -2

నటసింహ బాలకృష్ణ (Balakrishna), డైనమిక్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్ లో వస్తోన్న నాల్గవ చిత్రం 'అఖండ-2' అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇప్పటికే బాలయ్యతో వరుసగా మూడు చిత్రాలు రూపొందించి ఘనవిజయం సాధించిన బోయపాటి 'హ్యాట్రిక్' సొంతం చేసుకున్నారు. అందువల్ల 'అఖండ-2'పై అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుడు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. గురువారంతో 'అఖండ-2' డబ్బింగ్ పూర్తయింది. మిగిలిన కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈ సినిమా సెప్టెంబర్ 25న దసరా సీజన్ లో జనం ముందుకు రానుంది.

akhanda2


'అఖండ-2' చిత్రం బాలయ్య కెరీర్ లో రెండో సీక్వెల్ మూవీ. ఇక బోయపాటి శ్రీనుకు ఇదే మొదటి సీక్వెల్ పిక్చర్. అలాగే బాలయ్యకు ఇది మొదటి పాన్ ఇండియా మూవీ కాగా, బోయపాటికి రెండో పాన్ ఇండియా పిక్చర్. ఇలా హీరో, డైరెక్టర్ ఇద్దరికీ స్పెషల్ గా నిలచిన 'అఖండ-2' ఈ సారి ఏ లాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలని అన్ని వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.

Also Read: Theater Movies: ఈ శుక్ర‌వారం.. ఇండియా వైడ్ థియేట‌ర్ల‌కు వ‌స్తున్న సినిమాలివే! స‌గం హ‌ర్ర‌ర్ మూవీసే

Also Read: Jana Nayagan: సాగరం ఆవల ఆడియో వేడుక

Updated Date - Aug 08 , 2025 | 11:18 AM

Akhanda -2: హక్కుల కోసం ఓటీటీల ఆరాటం

Akhanda 2 : బాలయ్య సరసన సంయుక్త

Akhanda 2 Thandavam Heroine: ప్రగ్యా జైస్వాల్ ఏమైంది.. ఇదేం ట్విస్ట్ బోయపాటి?

Akhanda 2: సీక్వెల్‌కు సిద్ధం.. ఎన్నికల తర్వాతే!

Akhanda 2: Thaandavam: పవర్‌ఫుల్‌గా 'అఖండ తాండవం' టీజర్‌..