సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Virgin Boys OTT: ఆ ఓటీటీకి వ‌స్తోన్న‌.. మిత్రా శర్మ కుర్రాళ్ల సినిమా! అన్నీ ముద్దులు, ద్వందార్థాలే

ABN, Publish Date - Aug 14 , 2025 | 10:03 AM

గీతానంద్ , మిత్రా శర్మ జంటగా దయానంద్ గ‌డ్డం తెరకెక్కించిన‌ రొమాంటిక్ ఆడ‌ల్ట్‌ కామెడీ చిత్రం వర్జిన్‌ బాయ్స్‌.

Virgin Boys ott

గీతానంద్ (Geetanand), మిత్రా శర్మ (Mitraaw Sharma) జంటగా శ్రీహ‌న్ (Shrihan), బిగ్‌బాస్ విన్న‌ర్ కౌశ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో దయానంద్ గ‌డ్డం తెరకెక్కించిన‌ రొమాంటిక్ ఆడ‌ల్ట్‌ కామెడీ చిత్రం వర్జిన్‌ బాయ్స్‌ (Virgin Boys). రాజ‌గురు ఫిలింస్ బ్యాన‌ర్‌పై రాజా దరపునేని నిర్మించారు. కేవ‌లం యూత్‌ను టార్గెట్‌గా చేస్తూ, యువతీయువకుల మధ్య ప్రస్తుతం ఉన్న రిలేషన్‌షిప్స్‌ గురించి వివరిస్తూ సాగిన ఈ చిత్రం గ‌త నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి ఫ‌ర్వాలేద‌నిపించుకుంది. ఇండియాస్ మోస్ట్ డేరింగ్ రామ్‌కామ్ అంటూ మేక‌ర్స్ ప్ర‌క‌టించి ఆపై థియేట‌ర్ల‌లో మ‌నీ రెయిన్ అంటూ హాడావుడి చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఈ మూవీ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేస్తోంది.

క‌థ విష‌యానికి వ‌స్తే.. ఆర్య, డుండీ, రోనీ బీటెక్‌ స్టూడెంట్స్ అంతేగాక‌ ముగ్గరూ వర్జిన్స్‌. అయితే.. తమ క్లాస్‌మేట్‌ ఇచ్చిన ఓ పార్టీలో డిసెంబర్‌ 31లోపు వర్జినిటీ కోల్పోవాలని వారి చైల్డ్‌ హుడ్‌ ఫ్రెండ్‌ (కౌశల్‌ మంద) ఓ ఛాలెంజ్‌ విసురుతాడు. ఈ క్ర‌మంలోనే వారు ముగ్గురు త‌లో అమ్మాయిని ప్రేమిస్తారు. ఆపై ఆ అనుభ‌వం కోసం ప్ర‌య‌త్నించగా వారు స‌సేమిరా అంటారు. అంతేగాక ముగ్గురు అబ్బాయిలకు ప్రేమలో ఆ అమ్మాయి ఎటువంటి పరీక్షలు పెట్టారు? వాళ్ళ మధ్య దూరం పెరగడానికి కారణం ఏంటి? డిసెంబర్‌ 31లోపు తాము ప్రేమించిన అమ్మాయిలతో ఆ అబ్బాయిలు శారీరకంగా కలిశారా? లేదా? అనేది కథ.

గ‌తంలో యూట్యూబ‌ర్ హ‌ర్ష సాయితో మెగా లో డాన్ అంటూ ఓ సినిమా నిర్మిస్తున్న‌ట్లు హాడావుడి చేసిన మిత్రా శ‌ర్మ ఆపై హ‌ర్ష సాయి లైంగికంగా ఇబ్బంది పెట్టాడంటూ కేసులు సైతం పెట్టిన విష‌యం తెలిసిందే. అలాంటిది స‌డ‌న్‌గా మిత్రాశ‌ర్మ హీరోయిన్‌గా ఈ సినిమాలో న‌టించ‌డంతో పాటు నిర్మాణంలోనూ పాలు పంచుకుంది. టీజ‌ర్‌, పాట‌ల రిలీజ్ నుంచే ఇది పూర్తిగా కుర్రాళ్ల‌ కోసం మాత్ర‌మే తీసిన సినిమాగా పేరు, విమ‌ర్శ‌లు ద‌క్కించుకుంది. సినిమా మొత్తం అర్థ‌న‌గ్న దృశ్యాలు, డ‌బుల్ మీనింగ్ గైలాగ్స్, ముద్దు సన్నివేశాల‌తో నింపేశారు. ఇప్పుడీ మూవీ ఆగ‌స్టు 15 నుంచి ఆహా (Aha) ఓటీటీలో స్ట్రీమింగ్ అవ‌నుంది. మ‌సాలా , ఆడ‌ల్డ్ కామెడీ సినిమ‌లు చూడాల‌నుకునే వారికి ఈ వర్జిన్‌ బాయ్స్‌ (Virgin Boys) చిత్రం బెస్ట్ ఛాయిస్‌. పిల్ల‌లు, కుటుంబతో క‌ల‌సి చూసే ప్ర‌య‌త్నం ఎట్టి ప‌రిస్థితుల్లో చేయ‌రాదు.


Also.. Read ఇవి కూడా చ‌వ‌దండి..

Gamblers OTT: ఆ ఓటీటీకి వ‌చ్చేసిన.. మ్యాడ్ హీరో లేటెస్ట్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్

Coolie Twitter Review: ర‌జ‌నీ కూలీ ఎలా ఉందంటే.. ట్విట్ట‌ర్ రివ్యూ

War 2 Twitter X Review: హృతిక్ రోష‌న్, జూ.ఎన్టీఆర్.. వార్ 2 ఎలా ఉందంటే! ట్విట్ట‌ర్ X రివ్యూ

Coolie: ‘కూలీ’.. రజినీకాంత్ స్టాండ‌లోన్ చిత్రం! లోకేశ్ ఎమోష‌న‌ల్ పోస్ట్

Sadha: ఇండియాలో.. ఇలాంటి తీర్పా! భోరున విల‌పించిన స‌దా

Updated Date - Aug 14 , 2025 | 10:18 AM