సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Wedding Bells: ఏడు అడుగుల దిశగా నివేద పేతురాజ్

ABN, Publish Date - Aug 28 , 2025 | 08:54 AM

తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలలో నాయికగా నటించిన నివేదా పెతురాజ్ (Nivietha Pethuraj) త్వరలో పెళ్ళిపీటలు ఎక్కబోతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియచేసింది.

Nivitha Pethuraj

తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలలో నాయికగా నటించిన నివేదా పెతురాజ్ (Nivietha Pethuraj) త్వరలో పెళ్ళిపీటలు ఎక్కబోతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియచేసింది. సోషల్ మీడియాలో కాబోయే భర్తతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను నివేదా పేతురాజ్ షేర్ చేసింది. అతని పేరు రాజ్ హిత్ ఇబ్రాన్. దుబాయ్ లో బిజినెస్ మ్యాన్. కొన్నేళ్ళుగా వీరి మధ్య స్నేహం కొనసాగుతోంది. ఇప్పటికే నిశ్చితార్థం కూడా అయిపోయిందని తెలుస్తోంది. ఈ యేడాది చివరిలోగా వీరి పెళ్ళి జరుగుతుందని సమాచారం.


తమిళనాడులోని మధురైలో 1990లో జన్మించిన నివేదా పేతురాజ్ పదకెండేళ్ళ వయసులో తండ్రి ఉద్యోగ రీత్యా దుబాయ్ కు వెళ్ళిపోయింది. అక్కడే ఉన్నత విధ్య అభ్యసించింది. ఎడిన్ బర్గ్ లో మేనేజ్ మెంట్ లో డిగ్రీ పట్టా పట్టాపుచ్చుకున్న నివేదా, మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2015లో మిస్ ఇండియా యు.ఎ.ఇ. కిరీటాన్ని అందుకుంది. ఆ తర్వాత చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఆమె తమిళంలో 'ఒరు నాల్ కూతు' (Oru Naal Koothu) లో మొదట నటించింది. 'మెంటల్ మదిలో' (Mental Madhilo) చిత్రంతో 2017లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

తమిళ సినిమా రంగంలో ఉన్నప్పుడు ఇప్పటి తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయ్ నిధి స్టాలిన్ (Udayanidhi Stalin) తో నివేద ప్రేమ వ్యవహారం నడిపిందనే పుకార్లు వచ్చాయి. దాన్ని ఆమె తీవ్రంగా ఖండించింది. గత కొంతకాలంగా ఆచితూచి సినిమాలు చేస్తున్న నివేద పేతురాజ్ ఇప్పుడు పెళ్ళి ప్రకటన చేయడం విశేషం. ఆమె నటి మాత్రమే కాదు స్పోర్ట్స్ పర్సన్ కూడా. నివేద పెళ్ళి చేసుకోబోతోందన్న వార్త తెలియగానే తోటి నటీనటులు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.

Also Read: SISU 2: వ‌ర‌ల్డ్స్ టాప్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌.. ట్రైల‌ర్ వ‌చ్చేసింది! జీవితంలో చూసి ఉండ‌రు.. ఈసారి అంత‌కుమించి

Also Read: Thursday Tv Movies: గురువారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

Updated Date - Aug 28 , 2025 | 09:05 AM