Nivetha Pethuraj: సీఎం కొడుకు రూ. 50 కోట్ల గిఫ్ట్‌ ఇచ్చాడనే వార్తలపై నివేతా సీరియస్..

ABN , Publish Date - Mar 05 , 2024 | 06:30 PM

సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానళ్లలో తనపై ప్రసారం అవుతున్న వార్తలన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు హీరోయిన్ నివేతా పేతురాజ్. తనపై కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న వార్తలకు ఆమె క్లారిటీ ఇచ్చారు. ఆ వినబడే వార్తలలో వాస్తవం లేదని.. ఆ వార్తలు క్రియేట్ చేసిన వారిపై నివేతా ట్విట్టర్ వేదికగా సీరియస్ అయ్యారు. జర్నలిజం అంటే ఉన్న గౌరవం కారణంగా ఈ రూమర్స్ క్రియేట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదని ఆమె చెప్పుకొచ్చింది.

Nivetha Pethuraj: సీఎం కొడుకు రూ. 50 కోట్ల గిఫ్ట్‌ ఇచ్చాడనే వార్తలపై నివేతా సీరియస్..
Nivetha Pethuraj

సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానళ్లలో తనపై ప్రసారం అవుతున్న వార్తలన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు హీరోయిన్ నివేతా పేతురాజ్ (Nivetha Pethuraj). తనపై కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న వార్తలకు ఆమె క్లారిటీ ఇచ్చారు. ఆ వినబడే వార్తలలో వాస్తవం లేదని.. ఆ వార్తలు క్రియేట్ చేసిన వారిపై నివేతా ట్విట్టర్ వేదికగా సీరియస్ అయ్యారు. చాలా గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చానని, మీ అర్థం పర్థం లేని రాతల కారణంగా ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుందంటూ చిన్న పాటి క్లాస్ ఇచ్చారు నివేతా.

ముందుగా ఆమె విషయంలో వినిపిస్తున్న వార్తల విషయానికి వస్తే.. తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) తనయుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin).. నివేదా పేతురాజ్‌కు రూ. 50 కోట్ల విలువైన ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చారని, ఆమె కోసం ఆయన విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారంటూ తమిళనాడు మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై నివేదా పేతురాజ్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా వివరణ ఇస్తూ.. జర్నలిజం అంటే ఉన్న గౌరవం కారణంగా ఈ రూమర్స్ క్రియేట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదని వెల్లడించింది. (Nivetha Pethuraj Serious on Rumours)

Nivetha.jpg


నివేదా పేతురాజ్ తన పోస్ట్‌లో ఏం చెప్పిందంటే.. ‘‘నా కోసం విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారని ఇటీవల తప్పుడు వార్తలు కొన్ని నాపై రావడం గమనించాను. అయినప్పటికీ మౌనంగా ఉన్నా. కారణం.. ఒక అమ్మాయి జీవితం గురించి ఇలాంటి వార్తలు సృష్టించే బుద్దిలేని కొందరు వ్యక్తులు కాస్తైనా మానవత్వంతో ఉంటారని భావించా. ఇలాంటి తప్పుడు వార్తల కారణంగా కొన్ని రోజులుగా నేను, నా కుటుంబం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాం. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. నేను చాలా గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చాను. 16 ఏళ్ల వయసు నుంచే ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటున్నా. నా ఫ్యామిలీ ఇప్పటికీ దుబాయ్‌ (Dubai)లోనే నివసిస్తోంది. మేము దాదాపు 20 ఏళ్లకు పైగా అక్కడే ఉన్నాం. సినీ ఇండస్ట్రీలో కూడా నాకు అవకాశాలు ఇప్పించమని.. ఏ నిర్మాతను, దర్శకుడిని, హీరోను నేను అడగలేదు. ఇప్పటి వరకు 20కి పైగా సినిమాలు చేశా. నేను ఎప్పుడూ డబ్బు కోసం అత్యాశ పడలేదు.

Nivetha-2.jpg

నాపై ప్రచారం చేస్తున్న వార్తలలో వాస్తవం లేదని నేను ధృవీకరించగలను. మేము 2002 నుంచి దుబాయ్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నాం. అలాగే 2013 నుంచి రేసింగ్(Racing) అంటే నాకు ఇష్టం. నిజానికి చెన్నైలో రేస్‌లను నిర్వహించడం గురించి నాకసలు తెలియదు. మీరు నన్ను ఎక్కడో ఊహించుకుని చూస్తున్నారు. కానీ నేను చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నా. జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న తర్వాత మానసికంగా పరిణీతి సాధించాను. అంతేకాదు.. మీ కుటుంబంలోని స్త్రీలు కోరుకున్నట్లుగానే గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నా. జర్నలిజం (Journalism)లో కొంత మానవత్వం మిగిలి ఉందని భావిస్తూ.. ఇకపై నా పరువు తీసేలా వ్యవహరించరని ఇప్పటికీ నమ్ముతున్నందున చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు. దయచేసి మీడియా వారు ఒక కుటుంబ ప్రతిష్టను కించపరిచేలా మాట్లాడేముందు లేదా రాసే ముందు.. మీరు అందుకున్న సమాచారాన్ని ఒక్కసారి ధృవీకరించుకోవాలని కోరుతున్నాను. మా కుటుంబాన్ని ఇకపై ఎలాంటి బాధలకు గురిచేయవద్దని అభ్యర్థిస్తూ.. ఈ విషయంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని నివేదా పేతురాజ్ ఈ పోస్ట్‌లో రాసుకొచ్చింది.


ఇవి కూడా చదవండి:

====================

*Save The Tigers 2: ‘సేవ్ ద టైగర్స్ 2’ ట్రైలర్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..

***************************

*Charan and Upasana: భార్య కాళ్లకు మసాజ్ చేస్తున్న రామ్ చరణ్.. వీడియో వైరల్

************************

Updated Date - Mar 05 , 2024 | 06:30 PM