SISU 2: వరల్డ్స్ టాప్ యాక్షన్ థ్రిల్లర్.. ట్రైలర్ వచ్చేసింది! జీవితంలో చూసి ఉండరు.. ఈసారి అంతకుమించి
ABN , Publish Date - Aug 27 , 2025 | 09:27 PM
ప్రేక్షకులు ఎంతో ఈగర్లీగా ఎదురు చూస్తున్న సిసు రోడ్ టు రివేంజ్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడమే ఆలస్యం ప్రపంచ వ్యాప్తంగా మూవీ లవర్స్ ఎగిరి గంతేస్తున్నారు.
ప్రంచ ప్రేక్షకులు ఎంతో ఈగర్లీగా ఎదురు చూస్తున్న ట్రైలర్ రానే వచ్చింది. 2023లో అనామకంగా థియేటర్లలోకి వచ్చి వరల్డ్ సినిమాను ముఖ్యంగా యాక్షన్ లవర్స్ కు ఫుల్ కిక్ ఇచ్చి కలకాలం గుర్తుండి పోయేలా ఎంటర్‌టైన్ చేసిన చిత్రం సిసు (Sisu). హాలీవుడ్ చిత్రాలను తోసి మరి అల్‌టైమ్ టాప్ నాచ్ యాక్షన్ చిత్రాల్లో ప్రధమ స్థానంలో నిలిచింది ఈ ఫిన్ళాండ్ మూవీ.జోర్మా టోమిలా (Jorma Tommila) హీరోగా నటించిన ఈ సినిమాకు జల్మారి హెలాండర్ (Jalmari Helander) రచన, దర్శకత్వం చేశారు. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ సిసు రోడ్ టు రివేంజ్ (SISU Road to Revenge) తెరకెక్కింది. ఇందులోనూ జల్మారి మెయిన్ లీడ్‌గా నటించగా కొత్తగా అవతార్ విలన్ ఫ్టీఫెన్ లాంగ్ (Stephen Lang), రిచర్డ్ బ్రేక్ (Richard Brake) ఈ మూవీకి జత కలిశారు.
రిటైర్డ్ మిలటరీ వ్యక్తి అయిన హీరో తన భూమిలో దొరికిన బంగారంలో కొద్ది మొత్తాన్ని నగరానికి తీసుకెళుతున్న సమయంలో నాజీలు వెంటపడడం, దానిని దక్కించుకునే ప్రయత్నం చేయగా హీరో వారందరినీ ఎదిరించి తన బంగారంలో అనువంత కూడా వారికి చిక్కకుండా అడ్డొచ్చిన ప్రతి ఒక్కరి అంతు చూసి సిటీలోని బ్యాంకు వరకు ఎలా చేరుకున్నాడనే పాయింట్‌తో ముగించారు. ఇప్పడు ఈ ఎండింగ్‌కు కొనసాగింపుగా రెండో పార్ట్ ఉండనుంది. బంగారం, డబ్బుతో ఇంటికి వెళ్లిన హీరోకు అప్పటికే వార్ వళ్ల నాజీల చేతిలో తన కుటుంబం అంతా హత్యగావించబడి ఉంటుంది.
దీంతో నాజీలతో పొరాడడానికి సిద్దమైన హీరో తన ఇంటిని మొత్తాన్ని కూల్చి వేసి అక్కడి మెటీరియల్ అంతా ఓ ట్రక్కులో వేసుకుని నగరానికి వవెళుతున్న క్రమంలో తిరిగి నాజీ కమాండర్ ఎంటర్ అవడంతో కథ రసవత్తరంగా మారుతుంది. నాజీలు హీరోను బంధించడం, చిత్ర హింసలు పెట్టడం జరుగుతాయి. ఆ నేపథ్యంలో హీరో వారిన ఎలా ఎదుర్కొన్నాడు ఎలాంటి పోరాటాలు చేయాల్సి వచ్చింది, అందుకు అతను ఎంతవరకు వెళ్లాడు, తన ట్రక్కును ఎలా కాపాడుకున్నాడనే పాయింట్‌తో సెకండ్ పార్ట్ ఉండనుంది.
ఈ క్రమంలో బుధవారం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడమే ఆలస్యం ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ లవర్స్ ఎగిరి గంతేస్తున్నారు. అన్నింటికి మించి ట్రైలర్‌లో గత సినిమాను మించిన యాక్షన్ సన్నివేశాలు ఉండడంతో వారి ఆనందానికి పట్టపగ్గా లేకుండా పోయాయి. ఆ ట్రైలర్ చూసిన వారికి గూస్ బంప్స్ రావడం పక్కా. అంతలా ఆ ట్రైలర్ నిండా పోరాట సన్నివేశాలతో ప్రతీ సీన్ తీర్చదిద్దారు. విజువల్స్ సైతం మైండ్ బ్లోయింగ్‌గా ఉండగా యాక్షన్ కోరియోగ్రఫీ వామ్మో అనేలా జీవితంలో ఇలాంటి యాక్షన్ చూడలేం అనేలా ఉన్నాయి. కాగా ఈ సిసు రోడ్ టు రివేంజ్ (SISU Road to Revenge) సినిమా ఈ ఏడాది నవంబర్ 21న ప్రేక్షకుల ఎదుటకు థియేటర్లలోకి రానుంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ రిలీజ్ అవనుంది.