Nivetha Pethuraj Paruvu: ‘పరువు’..పోయిందా! నివేథా గొడ‌వంతా దీని కోస‌మే

ABN , Publish Date - May 31 , 2024 | 09:02 PM

నిన్న (గురువారం) రోజున దాస్ కీ ధ‌మ్కీ బ్యూటీ నివేథా పేతురాజ్ కారు డిక్కీ తీసే క్ర‌మంలో పోలీసుల‌తో వాగ్వాదం ఘ‌ట‌న బాగా వైర‌ల్ అయిన విస‌యం తెలిసిందే. తాజాగా ఈ ఇష్యూకు చెక్ పెడుతూ నివేథా త‌మ వెబ్ సిరీస్ అప్డేట్ ఇచ్చారు.

Nivetha Pethuraj Paruvu:  ‘పరువు’..పోయిందా! నివేథా గొడ‌వంతా దీని కోస‌మే
paruvu

సినిమాల ప్ర‌మోష‌న్స్ విష‌యంలో మ‌న యాక్ట‌ర్స్ రోజు రోజు కొత్త మ‌ర్గాల‌ను వెతుకుతూ ఎదో ర‌కంగా తాము న‌టిస్తోన్న సినిమాల‌ను జ‌నంలోకి తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోన్నారు. ఈక్ర‌మంలో వారు చేస్తోన్న ప‌నులు ఒక్కోసారి వారి సినిమాల‌కు మంచి హైప్‌ను తీసుకొస్తుండ‌గా కొన్నిసార్లు న‌వ్వుల పాలు చేయ‌డంతో పాటు తీవ్ర విమ‌ర్శ‌ల పాలు చేస్తోంది. గ‌త సంవ‌త్స‌రం వ‌ర‌కు మాజీ మంత్రి మ‌ల్లారెడ్డితో, యూ ట్యూబ్ సెల‌బ్రిటీస్‌తో క‌లిసి ప్ర‌మోష‌న్స్ చేయ‌గా ఇప్పుడు కాస్త రూట్ మార్చారు. మొన్న‌టికి మొన్న న‌భా న‌టేశ్ డార్లింగ్ డార్లింగ్ అంటూ ఓ డ‌బ్‌స్మాస్ వీడియో చేసి రచ్చ చేసిన సంగ‌తి తెలిసిందే. అంతేగాక న‌టుడు ప్రియ‌ద‌ర్శితో ట్విట్ట‌ర్‌లో వార్‌ చేసి మ‌రి డార్లింగ్ అనే ప‌దాన్ని ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. త‌ర్వాత అస‌లు ఇది వారిద్ద‌రి క‌ల‌యిక‌లో రాబోతున్న డార్లింగ్ సినిమా కోసం ఇదంతా చేసిన‌ట్లు ప్ర‌క‌టించ‌డంతో అంతా నిశ్చేస్టుల‌య్యారు.

ఇప్పుడు అదే వ‌రుస‌లో తాజాగా నిన్న (గురువారం) రోజున దాస్ కీ ధ‌మ్కీ బ్యూటీ నివేథా పేతురాజ్ (Nivetha Pethuraj) కారు డిక్కీ తీసే క్ర‌మంలో పోలీసుల‌తో వాగ్వాదం ఘ‌ట‌న బాగా వైర‌ల్ అయింది. నివేథా కారు డిక్కీని ఓపెన్ చ‌యండి పోలీసులు అడ‌గ్గా అది నా ప‌ర్స‌న‌ల్, ప‌రువుకు సంబంధించిన ప్రాబ్లం ఉంది నేను డిక్కీ తెర‌వ‌ను అంటూ అక్క‌డ ఉన్న పోలీసుల‌పై ఘ‌ట‌న‌పై ప‌బ్లిక్ ఆస‌క్తి చూప‌క పోగా చాలామంది ఇది ప్ర‌మోష‌న్ స్టంటే అంటూ తిట్టి పోశారు. ఇది జ‌రిగిన మ‌రునాడే ఇది ఓ సినిమా ప్ర‌మోష‌న్ కోసం చేసిందే అన్న‌ట్టుగా తాజాగా ఈ రోజు (శుక్ర‌వారం) ఆ చిత్రం ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు. దీంతో ఇదంతా ఇది అమ్మా పులి మాదిరిలా అయింద‌ని, పోలీస్ డిపార్ట్‌మెంట్‌పై జోకులు త‌ప్పుడు సంకేతాలు వ‌చ్చేలా చేస్తాయంటూ మండి ప‌డుతున్నారు.


GO6gwH1awAA7VrI.jpeg

ఈ మేర‌కు న‌టి నివేథా త‌న సోష‌ల్‌ మీడియా అకౌంట్ ద్వారా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేయ‌డంతో ఇప్పుడు ఈ న్యూస్ సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్‌ అవుతోంది. చాలా మంది మ‌త్తు వ‌ద‌ల‌రా ఫేమ్ న‌రేశ్ అగస్త్య (Naresh Agastya), నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) కాంబినేస‌న్‌లో ప‌రువు (Paruvu) అనే వెబ్ సిరీస్ తెర‌కెక్కింది. సిద్దార్థ్‌ – రాజశేఖర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా గోల్డెన్ బాక్స్ ఎంట‌ర్‌టైన‌మెంట్ (Gold Box Entertainments) బ్యాన‌ర్‌పై సుస్మిత కొణిదెల (Sushmita Konidela) నిర్మించింది. ఈ సిరీస్ జీ5 ఓటీటీలో జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ అవ‌నుంది. ఈ సిరీస్ నిమిత్త‌మే నివేథా గురువారం కారు, డిక్కీ ,ప‌రువు అంటూ పెద్ద డ్రామా చేయ‌డం, అది కాస్త వైర‌ల్ అయింది.

Updated Date - May 31 , 2024 | 09:02 PM