సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Allu Arjun: మంచు లక్ష్మీని ఆటపట్టించిన అల్లు అర్హ

ABN, Publish Date - Aug 07 , 2025 | 01:18 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అర్హ మంచు లక్మీని బలే ఆట పట్టించింది. లక్ష్మీ తెలుగు యాక్సెంట్ ను చూసి తెగ నవ్వుకుంది.

Manchu Laxmi - Allu Arha

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ముద్దుల కూతురు అల్లు అర్హ (Arha) కు ఓ గొప్ప సందేహం వచ్చింది. ఇటీవల మంచు లక్ష్మీ(Manchu Lakshmi) వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సందేహాన్ని అర్హ తీర్చేసుకుంది. మంచు లక్ష్మీ... అర్హను ఉద్దేశించి... 'నువ్వు నన్నేదో అడగాలని అనుకున్నావట కదా... ఏంటది' అని అడిగింది. 'నువ్వు తెలుగేనా' అనే సందేహాన్ని అల్లు అర్హ... మంచు లక్ష్మీ ముందు పెట్టింది. దాంతో కాస్తంత కన్ ఫ్యూజన్ కు గురైన లక్ష్మీ 'అదేమిటీ? నేనే నీతో మాట్లాడుతోంది తెలుగులోనే కదా... నీకెందుకు ఆ సందేహం కలిగింద'ని ఎదురు ప్రశ్నించింది. 'ఏం లేదు... నీ ఆక్సెంట్ అలా అనిస్తోంద'ని నవ్వుతూ బదులిచ్చింది అర్హ. 'నీది కూడా అలాగే ఉంటుంది కదా' అని నవ్వేస్తూ అర్హా తలపై ముద్దుపెట్టేసింది మంచు లక్ష్మీ!


నిజానికి అర్హ కు వచ్చిన సందేహం కొన్నేళ్ళుగా చాలామందికి ఉన్నదే! మంచు లక్ష్మీ ఎంత విదేశాలలో ఉండి చదువుకున్నా... డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు కదా! ఇలా తెలుగును ముక్కలు ముక్కలుగా చేసి మాట్లాడుతోందేంటీ? అని అనుకునే వారు. ఇన్నేళ్ళలో తెలుగును మాట్లాడే తీరును మంచు లక్ష్మీ మార్చుకోకపోవడమే దానికి కారణం. అయితే.... మంచు లక్ష్మీ ఈ విషయాన్ని చాలా లైట్ తీసుకుంటుంది. తన తెలుగు యాక్సెంట్ గురించి ఎవరైనా విమర్శించినా... స్పోర్టీవ్ గానే తీసుకుంటుంది. దానికి తాజా ఉదాహరణ అల్లు అర్హతో జరిగిన సంభాషణే! ఈ చిన్న వీడియోను స్వయంగా మంచు లక్ష్మీ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. దానిని చూసిన వాళ్లంతా తెగ ఆనందిస్తున్నారు. అల్లు అర్హా మాటకారి తనాన్ని, లక్ష్మీ జవాబును మళ్ళీ మళ్ళీ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు!

Also Read: War 2 Song: గ్లింప్స్ కే సలామ్‌ అంటే.. మరి పూర్తి పాటకు..

Also Read: Srivalli - Yesubai: రశ్మికపై ఆ రెండు పాత్రల ప్రభావం

Updated Date - Aug 07 , 2025 | 02:21 PM