War 2 Song: గ్లింప్స్ కే సలామ్ అంటే.. మరి పూర్తి పాటకు..
ABN , Publish Date - Aug 07 , 2025 | 01:05 PM
వార్ -2 గ్లింప్స్, టీజర్‌లతో సినిమాపై ఆసక్తి పెంచారు నిర్మాత ఆదిత్యా చోప్రా. ఇందులో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ యాక్షన్, డ్యాన్ చూసేందుకు ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 14 ఎప్పుడెప్పుడు వస్తుందా.. సినీ లవర్స్ ఎగ్జైటింగ్‌గా ఉన్నారు.
యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ(yash Raj Films) నుంచి వస్తున్న తాజా చిత్రం ‘వార్ 2’ (War 2) హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కీలక పాత్రధారులుగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. ఈ చిత్రం గురించి ప్రేక్షకులు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. గ్లింప్స్, టీజర్‌లతో సినిమాపై ఆసక్తి పెంచారు నిర్మాత ఆదిత్యా చోప్రా. ఇందులో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ యాక్షన్, డ్యాన్ చూసేందుకు ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 14 ఎప్పుడెప్పుడు వస్తుందా? సినీ లవర్స్ ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. ఈ చిత్రంలో హృతిక్ (Hrithik Roshan) తారక్(Tarak) లకు మంచి డాన్స్ నంబర్ ఉందని చాలాకాలంగా ప్రచారం సాగుతోంది. ఆ పాట కోసం అయితే అభిమానులు మరింతగా ఎదురుచూస్తున్నారు. తారక్, హృతిక్ రోషన్ ఇద్దరూ మంచి డాన్సర్లే. వీరిద్దరూ ఒకే తెరపై స్టెప్పులేస్తే ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. ఈ సినిమాలో తారక్, హృతిక్‌కు మధ్య సాగే సాంగ్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
‘రేయి పగలు ఏదైనా గానీ.. మనముంటే కాదా దీవాలీ.. దునియా మనకి సలామ్ అనాలి’ అంటూ సాగే పాటను అభిమానులకు కాస్త రుచి చూపించారు. ప్రీతమ్ సంగీతం అందించారు. తెలుగు వెర్షన్ పాటకు కృష్ణ కాంత్ సంగీతం అందించారు. లిరిక్స్ తగ్గట్టే బీట్ కూడా అదిరిపోయింది. బాస్కో లెస్లీ మార్టిస్ డాన్స్ కొరియోగ్రఫీ చేశారు. 35 సెకన్ల నిడివి ఉన్న ఈ సాంగ్ గ్లింప్స్‌లో తారక్, హృతిక్ ఇద్దరూ డాన్స్‌కు న్యాయం చేశారు. ఇద్దరికి ఒకేలాంటి స్టెప్స్, ఒకే నిడివి ఇచ్చారు. బేసిగ్గా ఇద్దరూ మంచి డాన్సర్లు కావడంతో బీట్‌కు తగ్గట్టు ఎక్కడా తగ్గకుండా స్టెప్పులేశారు. మాస్సీ స్టెప్పులతో అలరించారు. హృతిక్ డాన్స్ చూస్తే అతని కెరీర్ బిగినింగ్‌లో వచ్చిన ‘కహో నా ప్యార్ హై’ చిత్రంలోని ‘ఈక్ పల్ కా జీనా’ సాంగ్ గుర్తొచ్చింది. ఇక తారక్ డాన్స్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తన ప్రతి పాట వైవిధ్యంగా ఉండాలనుకుంటారు. ఇందులోనూ అలాగే చేశారు. కానీ ఆయన ఇంకా ఫాస్ట్ బీట్‌కు డాన్స్ చేయగలరు. ఓవరాల్‌గా బాగానే ఉన్నా.. తారక్ స్పీడ్‌తో పోలిస్తే ఈ పాటలో స్పీడ్ తక్కువనే చెప్పాలి. అయితే తెరపై ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి మరి. అభిమానులు మాత్రం చిన్న గ్లింప్స్‌కే ఫిదా అయిపోయి సలాం అంటున్నారు. తెరపై పూర్తి పాటను చూస్తే దునియా మొత్తం సలామ్ అనాల్సిందే అంటున్నారు అభిమానులు, నెటిజన్లు.
ఇక ఆదిత్యా చోప్రా స్ట్రాటజీ వేరుగా ఉంటుంది. ఇటువంటి క్రేజ్ ఉన్న పాటలను గతంలో కూడా ఆయన తెరపైనే చూపించారు. ‘బంటీ ఔర్ బబ్లీ’, కజ్రా రే, ధూమ్3’ పాటల్ని కూడా ఇలాగే బిగ్ స్క్రీన్ పైనే చూపించారు. అప్పట్లో 'కంమ్లీ' పాటను డైరెక్ట్ థియేటర్‌లో విడుదల చేశారు. వెండి తెర పై చూసిన వారంతా వావ్ అన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్-హృతిక్ డ్యాన్స్ సాంగ్ విడుదల విషయంలో కూడా ఆదిత్యా చోప్రా అదే స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారు. చిన్న గ్లింప్స్‌ను విడుదల చేసింది కూడా సినిమాపై ఆసక్తి పెంచడానికే అని తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే ఈ పాటకు మంచి క్రేజ్ ఏర్పడింది.
ALSO READ: Ramayana: కృత్రిమ మేధతో అలరించేలా 'రామాయణ'
The Rajasaab: ప్రభాస్ రాజాసాబ్.. నిర్మాత క్లారిటీ ఇచ్చేశారు..
Tamannaah Bhatia: పెద్ద హీరో అరుపులు.. తమన్నా ఏడుపు.. క్షమాపణలు
Mayasabha Review: దేవ కట్టా.. మయసభ వెబ్ సీరిస్ రివ్యూ
Kamal Haasan: నిన్న ఉదయనిధి.. నేడు కమల్..వీరికి తగిన గుణపాఠం చెప్పాలి