Manchu Controversy: మరోసారి మంచు ఫ్యామిలీలో భగ్గుమన్న మంటలు
ABN , Publish Date - Dec 23 , 2024 | 07:30 PM
మంచు కుటుంబంలో మళ్లీ మంటలు చెలరేగాయి.
మంచు కుటుంబంలో మళ్లీ మంటలు చెలరేగాయి. నటుడు మంచు మనోజ్ మరోసారి మంచు విష్ణుతో పాటు వినయ్ మహేశ్వరిలపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో 7 అంశాలను పేర్కొన్న మనోజ్. మంచు విష్ణు నుండి తనకు ప్రాణహాని ఉందని కంప్లైంట్. ఏడు పేజీల ఫిర్యాదుని పోలీసులకు పంపిన మనోజ్..
మరోవైపు నటుడు మంచు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. మోహన్‌బాబుపై రాచకొండ పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై గతంలో హైకోర్టులో విచారణకు రాగా.. ఈరోజు మరోసారి మోహన్ బాబు పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.
మోహన్ బాబు అరెస్ట్ కోసం రాచకొండ పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈనెల 24 వరకు మోహన్ బాబుకు కోర్టు గడువు ఇచ్చిందని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. 24 తర్వాత మోహన్‌బాబుకు నోటీసులు ఇస్తామని, చట్టపరమైన చర్యలు ఉంటాయని సీపీ వెల్లడించారు. అయితే నోటీసులు ఇచ్చినప్పటికీ కోర్టుకు హాజరుకాని పక్షంలో తగిన చర్యలు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. విచారణకు రావాల్సిందిగా మోహన్‌బాబుకు పోలీసులు నోటీసులు జారీ చేయనుండగా.. విచారణకు వచ్చేందుకు సమయం కావాలని మోహన్ బాబు కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నోటీసులకు స్పందించని పక్షంలో మోహన్ బాబు అరెస్ట్ ఖాయమని రాచకొండ పోలీసులు చెబుతున్నారు.