One Battle After Another: టైటానిక్ హీరో.. కొత్త సినిమా ట్రైల‌ర్ అదిరింది

ABN , Publish Date - Jul 24 , 2025 | 07:09 PM

టైటానిక్ స్టార్ లియోనార్డో డెకాఫ్రియో హీరోగా తెర‌కెక్కిన కొత్త హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం వ‌న్ బ్యాటిల్ ఆప్ట‌ర్ అన‌ద‌ర్.

Leonardo DiCaprio

టైటానిక్ స్టార్ లియోనార్డో డెకాఫ్రియో (Leonardo DiCaprio) హీరోగా తెర‌కెక్కిన కొత్త హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం వ‌న్ బ్యాటిల్ ఆప్ట‌ర్ అన‌ద‌ర్ (One Battle After Another). సీన్ పెన్ (Sean Penn), బెనిసియో డెల్ టోరో (Benicio del Toro), రెజీనా హాల్ (Regina Hall), టేయానా టేలర్ (Teyana Taylor), చేజ్ ఇన్ఫినిటీ (Chase Infiniti) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. పాల్ థామస్ ఆండర్సన్ (Paul Thomas Anderson) ర‌చించి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో పాటు స్వ‌యంగా నిర్మించారు. 1990లలో థామస్ పిన్‌చాన్ (Thomas Pynchon) ర‌చించిన‌ వైన్‌ల్యాండ్ (Vineland) అనే నవలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు.

ఈ సినిమా సెప్టెంబ‌ర్‌26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ ఈ మూవీ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. హీరో త‌న పాత జీవితానికి స్వ‌స్తి ప‌లికి భార్యా పిల్ల‌ల‌తో హ్యాపీగా కాలం గ‌డుపుతున్న వెళ్లదీస్తున్న స‌మ‌యంలో ప‌ద‌హారేండ్ల త‌ర్వాత వారి పాత శ‌త్రువు ప్ర‌తీకారం కోసం తిరిగి వ‌స్తాడు. ఈ నేప‌థ్యంలో హీరో, అత‌ని కుటుంబం వారి నుంచి ఎలా బ‌య‌ట ప‌డింది, వాళ్లు ఎలా ఎదుర్కొన్నార‌నే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగ‌నున్న‌ట్లు ట్రైల‌ర్ చూస్తే అర్ధ‌మవుతోంది. అంతేగాక క‌ళ్లు చెదిరే యాక్ష‌న్ సీన్లు సైతం అబ్బుర ప‌రిచేలా ఉన్నాయి. వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ (Warner Bros. Pictures) విడుద‌ల చేస్తోంది.


Also Read.. ఇవి కూడా చ‌ద‌వండి.. బావుంటాయ్‌

ఓటీటీలో.. డ‌కోటా జాన్స‌న్ రొమాంటిక్ డ్రామా! కుర్రాళ్లకు పండ‌గే

వార్‌2 ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. ఎన్టీఆర్ దుమ్ము దులిపేశాడు

ప‌వ‌న్ కళ్యాణ్‌: రెండు రోజులుగా.. నిద్ర లేదు

ప‌వ‌న్ కళ్యాణ్‌తో ఫొటో.. ఎగిరి గంతేసిన అభిమాని! వీడియో వైర‌ల్

OTTకి వ‌చ్చేసిన.. అదిరిపోయే లేటెస్ట్ క్రైమ్ థ్రిల్ల‌ర్

ఆ ఓటీటీకి వ‌చ్చిన‌.. న‌వీన్ చంద్ర ఫ్యామిలీ థ్రిల్ల‌ర్

Updated Date - Jul 25 , 2025 | 11:59 AM