Avatar 3D: ది వే ఆఫ్ వాటర్ అక్టోబర్ 2న రీ-రిలీజ్

ABN , Publish Date - Sep 04 , 2025 | 02:54 PM

అవతార్ సీరిస్ లో రెండో దైన 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' అక్టోబర్ 2న మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ త్రీ డీ వర్షన్ ను కేవలం వారం రోజులు మాత్రమే మేకర్స్ ప్రదర్శించబోతున్నారు.

Avatar: The way of Water

'అవతార్' సీరిస్ లో మూడోదైన 'అవతార్ : ఫైర్ అండ్ యాష్‌' (Avatar: Fire and Ash) కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆతృతతో ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ లో ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఈ లోగా 'అవతార్' (Avatar) రెండో భాగాన్ని తిరిగి జనం ముందుకు తీసుకొచ్చే పనిలో పడ్డారు మేకర్స్. జేమ్స్ కామెరూన్ (James Cameron) తెరకెక్కించిన మాస్టర్ పీస్ 'అవతార్ : ది వే ఆఫ్‌ వాటర్' (Avatar: The Way of Water) అక్టోబర్ 2న రీ-రిలీజ్ కాబోతోంది. అయితే... దీనిని కేవలం వారం రోజుల పాటు మాత్రమే ప్రదర్శించబోతున్నారు. అంతేకాదు... ఈ సినిమా త్రీడీ వర్షన్ మాత్రమే ఇప్పుడు రిలీజ్ కాబోతోంది.


'అవతార్' సినిమాకు భారతదేశంలోనూ భారీగా అభిమానులు ఉన్నారు. అందువల్లే ఈ సినిమా ఇండియాలో అత్యధిక వసూళ్ళు సాధించిన హాలీవుడ్ మూవీగా కొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. అలానే ఆస్కార్ అవార్డులలో బెస్ట్ అచీవ్ మెంట్ ఇన్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరిలో అవార్డును పొందింది. 'అవతార్ : ది వే ఆఫ్ వాటర్' మూవీ తొలిసారి 2022లో విడుదలైంది. ఇందులో సామ్ వర్తింగ్టన్, జోయి సాల్డానా ప్రధాన పాత్రల్లో నటించగా, సిగోర్నీ వీవర్, కేట్ విన్స్‌లెట్, స్టీఫెన్ లాంగ్ కూడా కీలక పాత్రల్లో కనిపించారు.


'అవతార్: ది వే ఆఫ్ వాటర్'ను మళ్లీ 3డీ లో చూడటం ద్వారా, పాండోరా అద్భుతమైన అండర్‌ వాటర్ లోకాలు, సల్లీ ఫ్యామిలీకి సంబంధించిన హత్తుకునే కథను పెద్ద తెరపై తిరిగి ఆస్వాదించే అవకాశాన్ని కలిగిస్తున్నామని ట్వంటీయత్ సెంచరీ స్టూడియోస్ సంస్థ తెలిపింది.

Also Read: Tollywood: అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు రామచంద్ర

Also Read: Param Sundari controversy: మలయాళ అమ్మాయిలు దొరకలేదా.. వివాదంపై సింగర్‌ పవిత్ర క్లారిటీ..

Updated Date - Sep 04 , 2025 | 03:01 PM

Avatar 2: 14 వేల కోట్ల మార్క్ దాటేసిన కామెరూన్ మూవీ.. ఇండియాలో మొదటి స్థానంలో..

Avatar 2: ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ మూవీగా రికార్డు

Avatar 2: కేరళలో అవతార్ 2కు షాక్!

Avatar 2: టామ్ క్రూజ్ సినిమా రికార్డును చెరిపేసిన అవతార్.. ఈ ఏడాది..

Avatar 2: డిజిటల్ స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్స్.. సినిమాను చూడాలంటే మాత్రం..